సేమ్ టాక్ కానీ రజిని మీద విజయ్ పై చేయి సాధించాడా..?

MADDIBOINA AJAY KUMAR
తమిళ నటుడు తలపతి విజయ్ కొంత కాలం క్రితం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. విజయ ఈ.మూవీ లో ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. వెంకత్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా స్నేహ నటించగా , కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల ఆయన మొదటి రోజే మిక్స్డ్ వచ్చింది. దానితో ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలక్షన్లను వసూలు కష్టం అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమా ప్రపంచవ్వ్యాప్తంగా చాలా ఏరియాల్లో తక్కువ కలెక్షన్లనే వసూలు చేసిన తమిళ నాడు ఏరియాలో భారీ కలక్షన్లను వసూలు చేసింది.

దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టయన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. టీ జే జ్ఞానవెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దగ్గుపాటి రానా ,  అమితా బచ్చన్ , ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రాలలో నటించారు. మంజు వారియర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ అక్టోబర్ 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు కూడా మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ మాత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: