ఆ విషయంలో చరణ్ ఫాన్స్ కి డిసప్పాయింట్మెంట్ మిగలనుందా.. ఆయన వల్ల కావట్లేదా..?

MADDIBOINA AJAY KUMAR
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ లో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ అపజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమాలో చరణ్ తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇకపోతే చాలా కాలం క్రితం చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

అంజలి , సునీల్ , శ్రీకాంత్  , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని మొదటి నుండి కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలను మాత్రం కేవలం తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఇక తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

అందులో గేమ్ చేంజర్ కు సంబంధించిన ఓ పాటను శ్రేయ ఘోషల్ పాడినట్లు , ఈ పాటకి సంబంధించిన మూడు వర్షన్స్ ను కేవలం 90 నిమిషాల్లోనే ఆమె పూర్తి చేసినట్లు పోస్ట్ చేశాడు. దీనితో కేవలం గేమ్ చేంజర్ మూవీ ని తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లోనే విడుదల చేస్తారా ..? మలయాళ , కన్నడ భాషల్లో విడుదల చేయడం లేదా అని అనుమానాలు రామ్ చరణ్ అభిమానులు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: