బిగ్ బీ ఇంట్లో విషాదం.. దుఃఖంలో జయా బచ్చన్..!

Divya
బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న హీరోలలో అమితాబచ్చన్ కూడా ఒకరు. బిగ్బి గా పేరుపొందిన అమితాబచ్చన్ ఎన్నో భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ అన్ని భాషలలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా చేయగలరు. ఈ మధ్యకాలంలో అమితాబచ్చన్ పాన్ ఇండియా లెవెల్లో కూడా సినిమాలలో నటిస్తే అభిమానులను కృషి ఇలాంటి సమయంలోనే అమితాబచ్చన్ ఇంట తాజాగా విషాద ఛాయలు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబచ్చన్ భార్య జయా బచ్చన్ తల్లి మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నివసిస్తూ ఉన్నదట. గడిచిన కొన్ని గంటల క్రితం అమితాబ్ బచ్చన్ అత్తగారు (జయా బచ్చన్ తల్లి) కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. వయోభారంతో వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్నప్పటికీ జయ బచ్చన్ తల్లి 94 ఏళ్ల వయసులో నిన్నటి రోజున రాత్రి మరణించిందట.

అయితే ఈ విషయం ఈరోజు తెలియడంతో బాలీవుడ్ మీడియాలో ఒక్కసారిగా  వైరల్ గా మారుతున్నది. ఈ విషయం విన్న బిగ్బి అభిమానుల సైతం తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు. తన అమ్మమ్మ మరణ వార్త విన్న వెంటనే అభిషేక్ బచ్చన్ హుదావుటిక భోపాల్ కు బయలుదేరి వెళ్ళినట్లు సమాచారం. ఆ తర్వాత వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా భోపాల్ కి వెళ్లారట. జయా బచ్చన్ తన తల్లి మరణ వార్త విని  తీవ్ర విషాదంలో మునిగిపోయిందట. దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా జయా బచ్చన్ తల్లికి నివాళులు అర్పిస్తున్నారు. అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.అమితాబచ్చన్ కి అత్తగారు అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.

అమితాబచ్చన్ ఇటీవలే రజినీకాంత్ నటించిన వెట్టయాన్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు. అలాగే కల్కి సినిమాలో కూడా అద్భుతమైన పాత్రలో నటించిన అమితాబచ్చన్ కల్కి-2  చిత్రంలో కూడా నటించడానికి చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: