వామ్మో: ఆశ్చర్యపోయేలా ఆస్తులు కూడా పెట్టిన ప్రభాస్.. ఎన్ని కోట్లంటే..?

Divya
టాలీవుడ్ హీరో గా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం దేశమంతటా గర్వంగా చెప్పుకొనే నటుడుగా పేరు సంపాదించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న  ప్రభాస్ రోజురోజుకి తన రేంజ్ పెంచుకుంటూనే ఉన్నారు. ఈరోజున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు నిన్నటి రోజు నుంచి సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సహాయం అని కోరితే చాలు చేసేస్తూ ఉంటారు. ఎన్నో సందర్భాలలో డొనేషన్స్ కూడా ఇచ్చారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడుగా కూడా పేరు సంపాదించారు.

ప్రభాస్ కెరియర్ ని మార్చేసిన చిత్రం బాహుబలి టాలీవుడ్ నుంచి ఇతర దేశాలలో కూడా తన పేరుని నిలబెట్టేలా చేసింది. అయితే ప్రభాస్ ఆస్తులు విలువ కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఇల్లు కార్లు వగైరా అన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయి. 2024 వరకు చూస్తే.. సుమారుగా 400 కోట్లకు పైగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పొలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారట.

అంతేకాకుండా తన స్నేహితులతో కలిసి నిర్మాణ భాగస్వామ్యం గా కూడా ప్రభాస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారట. కొన్ని సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాలలో వాటా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ఒక్క చిత్రానికి 150 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ అయితే వినిపిస్తూ ఉన్నది. పలు నగరాలలో విలాసవంతమైన ఇళ్ళతో పాటు రెండు కోట్ల రూపాయలు జిమ్ము కూడా ఉన్నదట. అంతేకాకుండా 84 ఎకరాలలు ఫామ్ హౌస్ని కూడా నిర్మించుకున్నారు. ముంబైలో ఒక ఇంటిని తీసుకున్నారట. ప్రభాస్ దగ్గర ఆరు లగ్జరీ కార్లతో పాటు ఐదు బైక్స్ కూడా ఉన్నాయట. ఇవే కాకుండా ఖరీదైన వస్తువులు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ తన సొంతంగానే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: