బిగ్ బాస్ 8లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నాగమణికంఠ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈయన హౌస్ లోకి వచ్చిన మొదటి వారంలోనే ఈయనపై చాలా నెగిటివిటీ వచ్చింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ ఈయన్ని దూరం పెట్టారు. దాంతో ఒంటరి అయిన ఈయనను చూసిన ప్రేక్షకులందరూ ఎక్కువ ఓట్లు వేశారు అలా ఏడు వారాల పాటు కొనసాగారు. ఇక ఈయన హౌస్ లో పదే పదే తన భార్య, బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వడంతో చాలామంది ఈయనకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. దాంతో ఇయన్నీ నామినేషన్స్ లో ఉన్నన్ని రోజులు ఆడియన్స్ ఓట్లు వేసి సేవ్ చేశారు. ఇక ఏడో వారంలో కూడా నాగ మణికంఠ వెళ్లేవాడు కాదు.కానీ ఆయనే తన హెల్త్ సహకరించడం లేదు అని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ ఎలిమినేట్ అయ్యాక ఖచ్చితంగా చాలామంది ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్తారు.
అలా వెళ్ళిన సమయంలో ఓ ఇంటర్వ్యూలో నాగ మణికంఠ గురించి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది.అదేంటంటే.. నాగమణికంట గే నా అంటూ ఓ యాంకర్ అడగడంతో ఆయన షాక్ అయిపోయారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..హౌస్ నుండి వచ్చాక చాలా మంది సెలబ్రిటీలు కొన్ని మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తారు. అలా నాగమణికంఠ కూడా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో యాంకర్ మీరెందుకు హౌస్ లో ఉన్న ఆడవాళ్ళు అందరితో అలా ప్రవర్తించారు. మీరు ఆడవాళ్ళతో ప్రవర్తించిన తీరుపై చాలామంది వ్యతిరేకించారు. మీపై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. అలాగే మీపై వచ్చే ట్రోల్స్ మీద కామెంట్ బాక్స్ చూస్తే మాత్రం మీరు గే అంటూ చాలామంది కామెంట్స్ చేశారు.
దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. నాపై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా నేను వాటిని పట్టించుకోను. నేను హౌస్ కి బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవాడిని.కానీ ఇప్పుడు హౌస్ నుండి బయటికి వచ్చాక అలాంటి వాటిని పట్టించుకోవడం లేదు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా అ ది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోను అంటూ నాగ మణికంఠ మాట్లాడారు. దీంతో నాగ మణికంఠ గే అంటూ వస్తున్న వార్తలు నెట్టింటి వైరల్ గా మారాయి