ప్రభాస్ తో రాజమౌళి చేయించలేని పని.. ఈ స్టార్ డైరెక్టర్ చేయిస్తున్నాడుగా.. ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!

Thota Jaya Madhuri
మనకు తెలిసిందే.. నిన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు . ఆయన పుట్టినరోజు వేడుకను ఫ్యాన్స్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు . ఎంతలా అంటే తమ సొంత ఇంటి మనిషి పుట్టినరోజు జరుపుకున్నంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . పెద్ద కేకులు కట్ చేసి అనాధ పిల్లలకి ఆ కేకులు పంచి .. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ప్రభాస్ పార్టీని చాలా పాజిటివ్ వేలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన నిన్న తన 45వ పుట్టినరోజు ను  చాలా సింపుల్గా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకున్నారు .


కాగా ఆయన వర్క్ చేస్తున్న సినిమాల డీటెయిల్స్ కు సంబంధించి కొన్ని పోస్టర్స్. అలాగే కొన్ని అప్డేట్స్ రిలీజ్ చేశారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న "రాజా సాబ్" సినిమా నుంచి స్పెషల్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో ప్రభాస్ డ్యూఎల్ లుక్స్ లో కనిపించబోతున్నారు . ఫస్ట్ ఆఫ్ లో యంగ్ ప్రభాస్ గా కనిపించబోతూ అదే ఫ్లాష్ బ్యాక్ లో ముసలి ప్రభాస్ గా కనిపించబోతున్నారు మారుతి .


కాగా నిన్న ప్రభాస్ కమిట్ అయిన మరొక సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ కూడా రిలీజ్ అయింది . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం "స్పిరిట్". మిగతా సినిమాల విషయం ఏమో కానీ స్పిరిట్ సినిమా కోసం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు . అర్జున్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రభాస్ లాంటి ఒక కమిటెడ్ హీరోతో  ఏ విధమైనటువంటి కంటెంట్ తెరకేకిస్తారు అనేది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది.


ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫిసర్ లుక్స్ లో కనిపించబోతున్నారు.  ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాలోను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు . గతంలో రాజమౌళి చత్రపతి సినిమాలో ఆయనను పోలీస్ గెటప్ లో చూపించాలి అని ఆశపడ్డారు . కానీ అది కుదరలేదు . కొన్ని కారణాల కారణంగా ఆ స్క్రిప్ట్ మారిపోయింది.  ఆ తర్వాత ఆయనకు పోలీస్ ఆఫీసర్ గా నటించే ఛాన్స్ వచ్చిన ఫస్ట్ పాత్ర ఇదే. దీంతో "స్పిరిట్" పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న ఆయన బర్త డే సందర్భంగా కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: