ధూంధాం చేసిన దసరా.. నాని కెరియర్ లోనే బాక్సాఫీస్ రికార్డులు.!

Pandrala Sravanthi
- మాస్ లుక్ లో నాని..
- బాక్సాఫీస్ రికార్డులు బద్దలు..  
- మాస్ హీరోలనే మరిచేలా యాక్టింగ్ చేసిన నాని.!

 హీరో నాని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా  ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి న్యాచురల్ స్టార్ గా పేరు పొందారు. అలాంటి నాని యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఎక్కువగా లవ్ స్టోరీలు, కుటుంబ కథా చిత్రాలు, కామెడీ చిత్రాలు తప్ప నాని మరో లుక్ లో చూసింది అయితే లేదు. అలాంటి నాని మాస్ లుక్ లో కూడా నటించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. దసరాతో తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు తిరగ రాశాడు. అలా నాని కెరియర్లో అద్భుతమైన హిట్ సాధించిన దసరా మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
 దసరా రికార్డులు:
నాని అష్టాచమ్మా, అలా మొదలైంది,భీమిలీ కబడ్డీ జట్టు, రైడ్, స్నేహితుడా ఇలా కొన్ని చిత్రాలతో ఇండస్ట్రీలో ఓ మోస్తారు హీరో గా గుర్తింపు పొందారు. వీటి తర్వాత ఆయన కెరీర్ ను ఓ మోస్తారుగా గాడిలో పడేసిన చిత్రం అలా మొదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలా ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈగ సినిమా నానిని కొత్త లుక్ లో చూపించారు. ఇందులో ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉన్నా కానీ ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. అలాంటి నాని కెరియర్ లో దసరాకు ముందు వరకు ఒక లెక్క దసరా తర్వాత మరో లెక్క అనే విధంగా దసరా సినిమా వచ్చింది. నాచురల్ స్టార్ గా పేరుపొందిన నాని, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మాణ సారధ్యంలో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఈ చిత్రం వచ్చింది.. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా చేసింది. దసరా సినిమా నేపథ్యంలో మాస్ లుక్ లో వచ్చినటువంటి ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైనటువంటి వసూళ్లు సాధించింది. నాని కెరియర్ లోనే దసరా సినిమాకు ముందు ఒక లెక్క తర్వాత ఒక లెక్క అనే విధంగా రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి ఈ చిత్రం 2023 ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు ఐఫా 2024 ఉత్తమ తెలుగు సినిమా అవార్డు కూడా దక్కింది. ఇక నాని దసరా సినిమా తర్వాత ఆయన రెమ్యూనరేషన్ కూడా ఆధ్యాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: