శోభిత- నాగ చైతన్య పెళ్లి పై స్పందించిన సమంత..ఒక్కే ఒక్క మాటతో అక్కినేని పరువు మొత్తం పాయ్యే..!?
తన బెస్ట్ కెమిస్ట్రీ పార్ట్నర్ సమంతనే అంటూ విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆయన చెప్పుకు రావడం గమనార్హం. ఈ కారణంగానే అక్కినేని ఫ్యాన్స్ సమంత కారణంగానే విడాకులు ప్రస్తావన వచ్చింది అని నాగచైతన్యకి సమంత అంటే చాలా ఇష్టం అంటూ బాగా సమంతని ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే ఎవరు ఊహించిన విధంగా నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకొని ఆ ఫొటోస్ ను బయట పెట్టాడు . అంతేకాదు త్వరలోనే వాళ్ళిద్దరూ మూడుముళ్ల బంధం తో ఒకటి కాబోతున్నారు .
వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు కూడా చకచకా కంప్లీట్ చేసేస్తుంది అక్కినేని ఫ్యామిలీ. కాగా ఇదే క్రమంలో హీరోయిన్ సమంత అసలు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లిపై ఏమనుకుంటుంది..? అసలు ఆమె మనసులో ఒపీనియన్ ఏంటి..? అన్నదానిపై జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు . దానికి తగ్గట్టే సమంత ఓ ఇంటర్వ్యూలు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి .
సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."ఈరోజు నేను బలంగా ఉన్నాను అంటే దానికి కారణం నేను ఎదుర్కొన్న టఫ్ సిచువేషన్సే . ఎవరైనా బాధలు పడుతున్నామని చెబితే నేను అది వాళ్ల మేలుకోసమే అని చెప్తూ ఉంటాను. కష్టాలు వచ్చినప్పుడు మనుషులు ఇంకా బలంగా స్ట్రాంగ్ గా నిలబడతారు. అట్టడుగు స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా మన బలాలు ఏంటో తెలుస్తుంది . కష్టాలలో పీక్స్ చూసిన తర్వాత మరి ఏ సమస్య వచ్చినా కూడా అది పెద్ద సమస్య గానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అట్టడుగు స్థాయికి వెళ్లి బాధపడే వారంతా అదృష్టవంతులని సమంత చెప్పుకొచ్చింది ".
అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా శోభిత - నాగచైతన్య పెళ్లికి సంబంధించిన చేసింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం సమంతకి బాధ కలిగిస్తున్నప్పటికీ అది ఆమెకు ఫ్యూచర్లో చాలా మేలు చేస్తుంది అని.. ఆ కారణంగానే ఇలాంటి కామెంట్స్ చేసింది అని చెప్పుకొస్తున్నారు. పరోక్షంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.