అలాంటి గబ్బు పని చేసిన తమన్నా..బ్యాన్ చేయాలి అంటున్న తెలుగు స్టార్ హీరోస్.. అసలు ఏమైందంటే..?

Thota Jaya Madhuri
ఇది నిజంగా తమన్నా ఫ్యాన్స్ కు వెరీ బాడ్ న్యూస్ అని చెప్పాలి . హీరోయిన్ తమన్నా అంటే అందరికీ స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది . మిల్కీ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . అంతేకాదు ఎలాంటి రోల్స్ నైనా  సరే అవలీలగా నటించేస్తుంది అని.. అలాంటి ఒక చక్కటి హీరోయిన్ తమన్నా అంటూ చాలామంది స్టార్ హీరోస్ కూడా పొదిడేశారు . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోని తమన్నా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ పెద్ద హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది .


మరి ముఖ్యంగా చిరంజీవి - ప్రభాస్ - తారక్- రామ్ చరణ్- మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకొని ఇండస్ట్రీని షేక్ చేసేసింది.  అయితే ఆమె టైం బ్యాడ్ అనే చెప్పాలి . తమన్నా ను తెలుగు హీరోస్ బ్యాన్ చేసే విధంగా మాట్లాడుకుంటున్నారట . దానికి కారణం ఈ మధ్యకాలంలో తమన్నా చేస్తున్న పనులే . ఒక సినిమాకి తమన్నా కమిట్మెంట్ ఇచ్చాక బాలీవుడ్ లో అంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తుంటే తెలుగు సినిమాకి ఇచ్చిన కాల్ షీట్స్ ను బాలీవుడ్ కి ఇచ్చేస్తుందట .


అంతేకాదు తెలుగు డైరెక్టర్స్ మాకు కాల్ షీట్స్ ఇచ్చావు కదా అని ప్రశ్నించిన రెస్పాండ్ అవ్వడం లేదట . తెలుగులో ఆమె ఈ మధ్య కాలంలో నటించిన  సినిమాలు ఫ్లాప్ అవడంతో తెలుగులో కన్నా బాలీవుడ్ లోనే లైఫ్ వస్తుంది అంటూ తమన్న ఇలా చేస్తుంది అంటున్నారు జనాలు . ఒక సినిమాకి కమిట్ అయ్యి ఆ సినిమాకి రెమ్యూనరేషన్ అడ్వాన్స్ తీసుకున్నాక ..ఆ కాల్ షీట్స్ వేరే ఎవరికీ ఇవ్వకూడదు . అయితే తమన్నా మాత్రం సినీ ఇండస్ట్రీ రూల్స్ బ్రేక్ చేస్తుంది .


ఆ కారణంగానే తెలుగు ఇండస్ట్రీ తమన్నాను బ్యాన్ చేయాలి అనుకుంటుందట . అంతేకాదు తమన్నా పలు వెబ్ సిరీస్ లల్లో బోల్డ్ గా నటించడం ఆమెకు మైనస్ గా మారింది . దీంతో తమన్నా పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . అయితే తెలుగు డైరెక్టర్ లు తెలుగు స్టార్ హీరోస్ మనసు మార్చుకుని తమన్నాతో సినిమాలను ఓకే చేస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తమన్నాని తెలుగు స్టార్ హీరోస్ బ్యాన్ చేయాలి అనుకుంటున్నారు అంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: