తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ షేక్.. పుష్ప గాడి దెబ్బకు రికార్డుల మోత..!!
- రికార్డులు క్రియేట్ చేసిన మూవీ
- సీక్వెల్ తో మరోసారి మన ముందుకు..
అల్లు అర్జున్.. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. వీడి మొహానికి సినిమాలు సెట్ అవుతాయా అంటూ ఎంతోమంది ఆయనను అన్నారట. అల్లు అర్జున్ అవన్నీ పట్టించుకోకుండా గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ విధంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్లిపోయారు అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్ గురించి పుష్ప చిత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
ది గ్రేట్ డైరెక్టర్ గా పేరు పొందిన సుకుమార్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేశారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ముత్యం శెట్టి మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీలో శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే అరుదైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యాపారం గురించి పూర్తిగా చూపించారు. ఇందులోకి అల్లు అర్జున్ కూలీగా ఎంట్రీ ఇచ్చి చివరికి కలప స్మగ్లింగ్ చేసే డాన్ గా ఎదుగుతాడు. ఆ విధంగా చిత్రాన్ని ఎన్నో అద్భుతమైన హంగులతో రూపొందించి అందరిని ఆకట్టుకునేలా చేశారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన గురించి మనం ఒక్క మాటలో చెప్పలేం. ఆయన నటన పుష్ప కు ముందు ఒక లెక్క పుష్ప తర్వాత మరోలెక్క అనే విధంగా ఉంది. అసలు ఈ పాత్రలో అల్లు అర్జున్ తప్ప మరో వ్యక్తి సెట్ అయ్యేవారు కాదు అనే విధంగా నటించాడని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రం 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయి ప్రేక్షకులు ఆదరణ పొంది ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 360 నుంచి 400 కోట్ల వరకు వసూలు సాధించింది. ఇక ఈ సినిమాకి 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు దక్కించుకున్నారు. అంతే కాదు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కూడా అవార్డు గెలుచుకున్నారు. అలాగే 67వ ఫిలింఫేర్ అవార్డుల్లో సౌత్ లో ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డు గెలుచుకున్నారు. ఈ విధంగా అన్ని రంగాల్లో కలిపి ఏడు అవార్డులను గెలుచుకొని రికార్డు క్రియేట్ చేసింది. అలాంటి పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా త్వరలో మన ముందుకు రాబోతోంది.