చరణ్ కెరీర్ లో రంగస్థలం చాలా స్పెషల్.. ఆ రేంజ్ కలెక్షన్లు ఊహించలేదుగా!

Reddy P Rajasekhar
కొన్నిసార్లు సాధారణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై ఆ అంచనాలను అందుకున్న సినిమా ఏదనే ప్రశ్నకు రంగస్థలం పేరు జవాబుగా వినిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కించిన రంగస్థలం మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం అనే చెప్పవచ్చు.
 
1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్ లోని అసలైన నటుడిని పరిచయం చేసింది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటించారని చెప్పడం కంటే జీవించారని చెప్పడం కరెక్ట్ అని చెప్పవచ్చు. చరణ్ సినీ కెరీర్ లో అత్యుత్తమ నట ప్రదర్శన ఇచ్చిన మూవీ రంగస్థలం అని చెప్పవచ్చు. రంగస్థలం సినిమాలో సమంత సైతం తన యాక్టింగ్ తో అదరగొట్టి ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించారు.
 
రంగస్థలం సినిమాకు బాక్సాఫీస్ వద్ద 216 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా 120 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలలో లాభాలను అందించిన సినిమాలలో రంగస్థలం ఒకటి. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు 35 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయని చెప్పవచ్చు. రంగస్థలం సినిమా ఇప్పటికీ బుల్లితెరపై మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.
 
రామ్ చరణ్ ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించగలరని రంగస్థలం సినిమాతో ప్రూవ్ కావడంతో చరణ్ కు అలాంటి పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రామ్ చరణ్ సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో, భారీ స్థాయిలో తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. రామ్ చరణ్ రేంజ్ రాబోయే రోజుల్లో అంతకంతకూ పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: