యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు సినిమాలతో పాటు
హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. దానికి ప్రధాన కారణం ఆర్ ఆర్ ఆర్
మూవీ కంటే ముందు
జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ స్థాయి క్రేజ్ తెలుగులో మాత్రమే ఉండేది. ఆర్ ఆర్ ఆర్
మూవీ విడుదల అయ్యి భారీ విజయం సాధించడం , అందులో
తారక్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయనకు ఈ సినిమాతో గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. దానితో ఈయన నటించిన సినిమాలను పాన్
ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు.
ఈయన కూడా తెలుగు తో పాటు ఇతర భాష సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్
సినిమా అనేక రికార్డులను నెలకొల్పింది. ఈ
సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ
సినిమా తర్వాత
తారక్ చాలా కాలం గ్యాప్ తీసుకొని మరి దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అలాగే ఇప్పటికి కూడా స్టడీగా కలెక్షన్లను రాబడుతుంది. దానితో ఈ
మూవీ 600 కోట్ల మైలురాయిని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇలా ఆర్ ఆర్ ఆర్
మూవీ నుండి మొదలు పెడితే దేవర వరకు
తారక్ ఎన్నో కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తూ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే
తారక్ ప్రస్తుతం
హిందీ సినిమా అయినటువంటి
వార్ 2 లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ
మూవీ చేయడానికి రెడీగా ఉన్నాడు. వీటి తరువాత దేవర 2
మూవీ ని స్టార్ట్ చేస్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.