మహేష్ మూవీ కోసం స్పెషల్ క్లాస్ లకు జక్కన్న.. బాక్సాఫీస్ తగలబడి పోద్దిగా..!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమ దశ దిశను మార్చిన దర్శకులలో రాజమౌళి ఒకరు .. ఇక తాను తీసిన బాహుబలి సినిమాలతో తన ఫ్యూచర్ విజన్ ఏ స్థాయిలో ఉంటుందో క్లారిటీ ఇచ్చేశాడుమ‌.. తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్‌ను ఇండియన్ సినిమాకు అందించి తన బ్రాండ్ కు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే జనాల్లో పిచ్చి మామూలుగా లేదు .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటేఏ రేంజ్ లో ఉంటుందో అంచనా కూడా వేయలేకపోతున్నారు అభిమానులు . టాలీవుడ్ స్టార్ హీరోలను పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం చేస్తూ తనతో పాటు వాళ్లకు కూడా తిరుగులేని క్రేజ్ ఇస్తు విజువల్ వండర్స్‌ను తెలుగు ప్రేక్షకులకే కాదు ప్రపంచ సినిమా పిచ్చోళ్లకు చూపిస్తున్నాడు.

రాజమౌళి సినిమాలను చూసి టాలీవుడ్ బాలీవుడ్ డైరెక్టర్లు కూడా తమ నిమాలకు మరింత ప‌దున పెడుతూ సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమా ఏ రేంజ్ లో ఉండాలో యువ దర్శకులు రాజమౌళిని చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి రాజమౌళి కూడా  స్పెషల్ క్లాస్ లకు అటెండ్ అవుతున్నారని వార్త టాలీవుడ్ నూంచి బాలీవుడ్ వరకు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మహేష్ బాబు తో చేసే సినిమా షూటింగ్ ను జనవరి మొదటి వారం నుంచి మొదలు పెడతారని అంటున్నారు. ఇప్పటి నుంచే మేకర్స్ భారీ సెట్ని కూడా రెడీ చేస్తున్నారు.

టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసారి రాజమౌళి హాలీవుడ్‌ను టార్గెట్గా చేసుకొని సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల్లో కొన్ని సీన్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ కూడా తీసుకోవడానికి కూడా జక్కన్న సనాహాలు చేస్తున్నాడు. అయితే వాటి కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏఐని తన సినిమా కోసం ఏ రేంజ్ లో వాడుకోవాలో తెలుసుకోవడానికి అందుకు సంబంధించిన ట్రిక్స్ కోసం స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు రాజమౌళి. మరి మహేష్ సినిమాతో రాజమౌళి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: