ఇప్పటికి రెండు సార్లు చేదు అనుభవం.. అయినా పవన్ ఎందుకు ఆ పని చేస్తున్నాడు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో రీమిక్ సినిమాలలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే రీమిక్ సినిమాల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఏకంగా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయిన సినిమాలను కూడా రీమేక్ చేస్తూ వస్తున్నాడు.

కానీ వాటి ద్వారా మాత్రం పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరకు విజయాలు దక్కలేదు. కొంత కాలం క్రితం తమిళ నటుడు అజిత్ "వీరమ్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తమిళ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పరవాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమాను కాటమ రాయుడు అనే పేరుతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కొంత కాలం క్రితం సముద్ర ఖని నటించి , దర్శకత్వం వహించిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగులో ఓ టీ టీ లో విడుదల చేశారు.

తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను బ్రో అనే టైటిల్ తో పవన్ రీమేక్ చేశాడు. ఈ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం తమిళ నటుడు విజయ్ "తేరి" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో పోలీసోడు అనే టైటిల్ తో డబ్  చేసి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాను పవన్ కళ్యాణ్ *ఉస్తాద్ భగత్ సింగ్" అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: