అటు మూవీస్.. ఇటు వెబ్ సిరీస్లు.. ఈ నలుగురిని ఆపడం కష్టమే..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన వారు సైతం ఆ తర్వాత వారి క్రేజ్ తగ్గగానే సినిమాలకు కొంత కాలం దూరంగా ఉండటం , లేదంటే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన వారు ఆ తర్వాత ఆ స్థాయి సినిమాల్లో అవకాశాలు రాకపోయినా , సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు రాకపోయినా వారు చిన్న చిన్న పాత్రలు చేయడం కంటే కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.

అందుకు ప్రధాన కారణం వెబ్ సిరీస్లలో నటించడం ద్వారా వారికి మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంటుంది. సినిమాలో చిన్న పాత్రలలో నటించి వారి క్రేజ్ తగ్గింది అని ఫీల్ కావడం కంటే వెబ్ సిరీస్ లలో ప్రధాన పాత్రలలో నటించడం మంచిది అని జనాలు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించి ప్రస్తుతం కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్న కొంత మంది వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అలాంటి వారిలో తమన్నా ,  కాజల్ అగర్వాల్ , సమంత త్రిష ముందు వరుసలో ఉన్నారు. వీరు నలుగురు ఎన్నో సంవత్సరాలు తెలుగు  సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించారు.

ప్రస్తుతం కూడా వీరికి మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఈ ముగ్గురు ముద్దు గుమ్మలు వరస పెట్టి వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే వీరు నటించిన వెబ్ సిరీస్ లకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలా ఈ నలుగురు ముద్దుగుమ్మలు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: