వీర సింహారెడ్డిని ఫాలో కానున్న బాలయ్య.. అదే జరిగితే రికార్డ్స్ గల్లంతే..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల చేశారు. పోయిన సంవత్సరం చాలా సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాక అందరి కంటే ముందు బాలయ్య హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ విడుదల అయింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ మూవీ మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయనున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. కొంత కాలం క్రితం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు అని ఒక వార్త వైరల్ అయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన మూవీ యూనిట్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన గేమ్ చేంజర్ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆ సినిమా కంటే ముందే ఎన్బికె 109 మూవీ ని విడుదల చేయనున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా వీర సింహా రెడ్డి మూవీ లాగానే ఎన్బికె 109 సినిమాను కూడా సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాల కంటే ముందు విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: