షాక్‌: వ‌రంగ‌ల్‌లో 12 థియేట‌ర్లు క్లోజ్‌...!

RAMAKRISHNA S.S.
ఒకప్పుడు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం అంటే అదో సరదా. అదో పండగ వాతావరణం. పూర్వకాలంలో ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ వేదికలు లేవు. ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే సినిమా ఒక్కటే ప్రధాన మార్గం. ఇక ఒక థియేటర్ నడవడం వల్ల పట్టణాల్లో పదిమంది.. గ్రామీణ ప్రాంతాల్లో ఐదుగురు.. ఉపాధి పొందుతారు. ఒకప్పుడు సినిమా విడుదల ఉందంటే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఉండేది. ప్రధానంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల కొత్త సినిమాలతో నెలకొనే కోలాహలం అంతా ఇంతా కాదు. ఇంటిల్లిపాది సినిమా చూస్తేనే పండగకు నిండుతనం వచ్చేది. కరోనా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో వెండితెర సంక్షోభంలోకి వెళ్లిపోయింది.

ఇప్పటికే ఇంకా కోలుకోలేదు. చాలా పల్లెటూరులో మాత్రమే కాదు పట్టణాలలోనూ థియేటర్లో మూత‌పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత నాలుగేళ్లలో 15 థియేటర్లో మోసేసారు. కొన్ని థియేటర్లు మందిరాలుగా మారుతుంటే.. మరికొన్ని ఫంక్షన్ హాల్స్ గా.. మరికొన్ని వాణిజ్య సముదాయాలుగా మారుతున్నాయి. ప్రేక్షకుల ఇంట్లో రంగురంగుల టీవీలలో సినిమాలు, ఓటీటీ ద్వారా సినిమాలు చూస్తున్నారు. దీంతో థియేటర్ల సగం మూతుప‌డుతున్నాయి. గత మూడేళ్లలో వరంగల్ నగరంలో భారీగా థియేటర్‌లో మూసివేస్తున్న పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 థియేటర్లు మోసివేశారు.

అంటే థియేటర్ల వ్యాపారం ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. దీనికి తోడు పట్టణాలలో థియేటర్లు ఉన్న ప్రాంతాల్లో రోజురోజుకు భూముల విలువ పెరుగుతోంది. దీంతో థియేటర్లు తొలగించి భారీ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు థియేటర్లు అంటే లాభాలుగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. థియేటర్లు ఉన్న ఎవరో ఒకరికి లీజుకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. కేవలం వరంగల్ నగర పరిధిలో గత మూడు, నాలుగు సంవత్సరాల లో 12 థియేటర్లు మూసివేశారు. ములుగు జిల్లాలో మూడు థియేటర్లు, జనగామ జిల్లాలో రెండు థియేటర్లు మూసివేసిన పరిస్థితి. దీనిని బట్టి చూస్తుంటే భవిష్యత్తులో థియేటర్ల వ్యాపారానికి ఏ మాత్రం ఆదరణ లేదని స్పష్టంగా తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: