ఆ నిర్మాతలపై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇలా చేయడం దారుణమంటూ?
ప్రభాస్ తో ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. కల్కి2, సలార్2, స్పిరిట్, ఫౌజీ ఇతర సినిమాల అప్ డేట్స్ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో పండుగ చేసుకోవచ్చని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరగడం గమనార్హం. ప్రభాస్ సినిమాల మేకర్స్ ఊరించి ఉసూరుమనిపించారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
ప్రభాస్ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ సినిమాలు 300 నుంచి 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ రేంజ్ లో బడ్జెట్ వర్కౌట్ కావాలంటే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తే మాత్రమే సాధ్యమవుతుంది.
భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం కొసమెరుపు. ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. ప్రభాస్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ హీరో అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని అభిప్రాయలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.