ఏషియన్ గ్రూప్‌పై భారీ డీల్... టాలీవుడ్ హాట్ టాపిక్...?
- కొంత వాటా అమ్మేలా ఒప్పందాలు .. ?
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్‌లో.. ఆ మాటకు వస్తే నైజం పంపిణీ రంగం లో అతిపెద్ద వ్యాపార సంస్థ ఏసియన్ గ్రూప్. ఈ గ్రూప్ ధియేటర్లు, మల్టీప్లెక్స్ సినిమా నిర్మాణాలు.. ఇలా చాలా వ్యాపారాలలో భాగమై ఉంది. సునీల్ నారంగ్ కుటుంబంతో పాటు.. దగ్గుబాటి బ్రదర్స్ దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్ ఈ గ్రూపులో భాగస్వాములు. తాజా సమాచారం ప్రకారం ఏషియన్ గ్రూపు లో మెజార్టీ వాటా లేదా కొంత వాటా ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ కు విక్రయించడానికి చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది.
తాజాగా కరణ్ జోహార్ సంస్థలో వేయికోట్ల పెట్టుబడి పెట్టిన పూనావాలా సంస్థ.. ఇప్పుడు ఏషియన్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత శాతం వాటా అమ్ముతారు. ఎన్ని కోట్లకు అమ్ముతారు. అన్నదానపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్న పుకారులు వినిపిస్తున్నాయి. మామూలుగా చెప్పాలంటే ఇటు దగ్గుపాట్టి కుటుంబానికి.. అటు ఏషియన్ ఫ్యామిలీ కి ఆర్థిక సమస్యలు లేవు. వీళ్ళు వాటా అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇటు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఎంత పెద్ద సంస్థో టాలీవుడ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలిసిందే.
అటు ఏషియన్ వాళ్లు అయితే నైజాం పంపిణీ రంగాన్ని శాసిస్తున్నారు. నైజాంలో ఎన్నో థియేటర్లను వీరు నిర్వహిస్తున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు, భారీగా మల్టీప్లెక్స్ విస్తరించాలన్న ఆలోచన వీరికి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరింత పెట్టుబడి సమకూర్చుకోవాలన్న ప్రణాళికతో వీరు ఈ సంస్థలో కొంత వాటా అమ్మాలని అనుకుంటున్నారన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది. ఇదంతా ఇంక ప్రారంభ దశలో ఉందని చర్చలు పూర్తి కావాల్సి ఉన్నాయని అంటున్నారు.