10 కోట్లతో రామ్ చరణ్ కొత్త కారు .. అందులో స్పెషల్ ఏమిటంటే ..!

Amruth kumar
గ్లోబల్ స్టార్ గా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు .. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా హీరో ఇప్పుడు గేమ్ ఛేంజెర్‌ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రామ్ చరణ్.. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. సినిమాల్లో నటించడమే కాకుండా రామ్ చరణ్ గొప్ప వ్యాపారవేత్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ 7.50 కోట్ల విలువ చేసే లక్సరీ కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎంత భారీ లగ్జరీ కారు మరి ఏ హీరోకు లేదని కూడా అంటారు. ఇంతకీ ఆ కారు ఫీచర్లు ఏమిటి ? అనే విషయాలు ఇక్కడ చూద్దాం. రామ్ చరణ్ కొనుగోలు చేసిన ఆ కార్ రోల్స్ రాయిస్ ..  ఇప్పటికే చాలా మంది హీరోలు కొనుగోలు చేసుకున్న కారు ఇదే.. ఇది ఎంతో ఖరీదు అన్ని కూడా అంటారు .. అలాగే వినూత్నమైన సాంకేతికలు పద్ధతి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇక రామ్‌చరణ్ రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారును కొనుగోలు చేసాడు.

ఈ కారు ధర 7.50 కోట్ల రూపాయలు.. రోల్స్ రాయిస్ ఇతర కార్ల కంటే స్పెక్టర్ కారు డిజైన్ టెక్నాలజీలో ఎన్నో మార్పులు కలిగి ఉంటుంది. అలాగే ఈ కారులో రెండు డోర్లు నలుగురు కూర్చునే అవకాశం ఉంటుంది. ఇది ప్రయాణీకులకు పూర్తి భద్రతను అందిస్తుంది. అందుకే ఈ కారు ధర చాలా ఎక్కువ. ఇప్పటికే చరణ్ గ్యారేజీలో అనేక కార్లు ఉన్నాయి. అలాగే సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నాడు. అంతేకాదు.. ప్రైవేట్ జెట్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు. ఈ పరిశ్రమలో రామ్ చరణ్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. రామ్ చరణ్ సినిమా నిర్మాణంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: