శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరో దివంగత శోభన్ బాబు పేరు చెప్పగానే అందరికీ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి నటి జయలలిత పేరే గుర్తుకొస్తుంది. ఎందుకంటే వీరి రిలేషన్ గురించి వీరు జీవించి ఉన్న సమయంలో ఎన్నో వార్తలు అప్పటి మీడియాలో వైరల్ గా మారాయి. అయితే శోభన్ బాబు జయలలిత ను పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ తనను నమ్మి తనవంటే వచ్చిన తన భార్యకి అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో జ‌య‌లలిత అని పెళ్లి చేసుకోకుండా రహస్యంగా ఆమెతో వ్యవహారాలు నడిపారని అప్పట్లో ఓ టాక్ కూడా వినిపించింది.  ఇక మన తెలుగులో సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న శోభన బాబుకు ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన అందానికి అమ్మాయిలు మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు కూడా పడిపోయారని కూడా అంటారు.

కానీ శోభన్ బాబు ఎక్కడా కూడా తన కెరీర్లో రాంగ్ స్టెప్ వేయలేదు. ఒక్క జయలలిత విషయంలో మాత్రం రాంగ్ స్టాప్ వేసారని అంటారు. అయితే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది.. అది నిజమే కావచ్చు .. కానీ అప్పట్లో వీరికి కూతురు పుట్టిందనే వార్తలు కూడా వ‌చ్చ‌యి.. అయితే వాటిని చిత్ర పరిశ్రమ పెద్దలు ఖండించారు. ఆ రోజుల్లో వీరు సహజీవనం చేశారని వీరికో ఒక అమ్మాయి కూడా పుట్టిందని ఎన్నో ఫేక్ వార్తలు వచ్చాయి. అయితే ఎవరు ఊహించిన విధంగా జ‌య‌లక్ష్మీ అనే మహిళను జయలలిత - శోభన్ బాబుకు పుట్టిన సంతానమని కావాలంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించండి అంటూ మీడియా ముందు కూడా తీసుకొచ్చారు. ఆల‌ జయలక్ష్మి ఒకసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

అయితే కొన్ని కారణాల కారణంగా ఇన్ని రోజులు వారి కూతుర్ని నేను బయట చెప్పుకోలేదంటూ కూడా అమె చెప్పకు వచ్చింది .. ఇక ఈ విషయాన్ని జయలలిత మరణించాక జయలక్ష్మి చెప్పింది.. అంతే కాకుండా జయలలిత ఆస్తికి నేనే వారసురాలని కూడా ఆమె చెప్పుకొచ్చింది. దాంతో చాలామంది ఈమె జయలలిత ఆస్తికి ఆశపడే ఇలా కూతుర్ని అని చెప్పుకుందంటూ మాట్లాడుకున్నారు. అలా అప్పట్లో జయలలిత శోభన్ బాబుల గురించి పత్రికల్లో,టీవీలలో ఎన్నో వార్తలు వినిపించాయి. ఇక వాటిల్లో ఏది నిజం లేదని కావాలనినే అలాంటి వార్తలు కొందరు పుట్టించారని చిత్రపరిశ్ర‌మ‌లో పెద్దలు అంటారు. జయలలిత - శోభన్ బాబు మంచి స్నేహితులు మాత్రమే అని వారి మ‌ద్య‌ ఎలాంటి సంబంధం లేదని వారిని దగ్గరగా చూసినవారు చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: