ప్రభాస్ సలార్‌ మూవీ అరుదైన రికార్డు.. ఏకంగా 250 రోజులుగా ?

Veldandi Saikiran
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి 1, 2 సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాలతో ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. ఈ హీరో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా సలార్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషించారు. జగపతిబాబు, బాబి సింహ, శ్రియ రెడ్డి, ఆనంద్ వంటి ప్రముఖులు వివిధ పాత్రలో కనిపించారు. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొత్తంగా ఈ సినిమా రూ. 700 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీలో సలార్ సినిమా హవా కొనసాగుతోంది.

నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ హిందీ వెర్షన్ రికార్డ్ సృష్టించినట్లు హాట్ స్టార్ తెలియజేస్తూ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హిందీ వెర్షన్ ఏకంగా 250 రోజులుగా ట్రేడింగ్ లో ఉందంటూ హాట్స్టార్ తెలియజేసింది. కాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. సలార్ సినిమా మంచి విజయం సాధించడంతో సలార్ 2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారట.

ఇప్పటికే సలార్ 2 సినిమాకు సంబంధించి ప్రభాస్ తో సంప్రదింపులు జరిపారట. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి. దీంతోపాటు ప్రభాస్ స్పిరిట్, రాజా సాబ్ ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్ అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: