టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సైఫ్ ఆలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ అత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా మంచి కలెక్షన్లను చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజెర్ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే రిలీజ్ కు ముందే దేవర సినిమాని గేమ్ చేంజర్ మూవీ ఓ విషయంలో దాటేసినట్లు ఓ వార్త వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... దేవర సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దేవర సినిమాకి 110 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఇక గేమ్ చేంజర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 150 కోట్ల ప్రియ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
దానితో దేవర మూవీ కంటే 40 కోట్ల ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ ను గేమ్ చేంజర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంది అనే వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేది చిన్న విషయం ఏమీ కాదు అని ఇంత పెద్ద టార్గెట్ ను దాటాలి అంటే సినిమాకు ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ రావాలి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి టాక్ నీ తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.