2024 లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన టాప్ 4 సినిమాలివే.. ఆ ప్లేస్లో దేవర..?

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో భాగంగా బుక్ మై షో లో ఇప్పటివరకు విడుదల అయిన తెలుగు సినిమాలలో బుక్ మై షో లో ఎక్కువ టికెట్స్ సెల్ అయినా సినిమాలలో టాప్ 4 లో ఉన్న సినిమాలు ఏవి ..? అందులో దేవర సినిమా ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

కల్కి 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించగా ... నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఏకంగా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం విడుదల అయిన తెలుగు సినిమాలలో బుక్ మై షో లో ఈ సినిమాకే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ మూవీ కి సంబంధించిన 1.24 కోట్ల టికెట్లు బుక్ మై షో లో అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

సలార్ : ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన 70 లక్షల టికెట్లు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

దేవర : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికి కూడా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 47 లక్షల టికెట్లు బుక్ మై షో లో అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

హనుమాన్ : తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన 45 లక్షల టికెట్లు బుక్ మై షో యాప్ లో అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: