నాగార్జున హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మన్మధుడు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , మాటలు , స్క్రీన్ ప్లే ను అందించాడు. ఇకపోతే 2002 వ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా స్టార్ట్ కాక ముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం.
దర్శకుడు విజయ్ భాస్కర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అప్పటికే కొన్ని సినిమాలు రూపొందాయి. వారి కాంబోలో రూపొందిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. వీరి కాంబో లో 2001 వ సంవత్సరం నువ్వు నాకు నచ్చావు అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక దర్శకుడు విజయ్ భాస్కర్ , త్రివిక్రమ్ సహకారంతో మరో సినిమా కూడా చేయాలి అనుకున్నాడట. ఇక త్రివిక్రమ్ మాత్రం తన దగ్గర ప్రస్తుతానికి రెండు కథలు ఉన్నాయి. వాటితో దర్శకత్వంలోకి దిగాలి అనుకున్నాడట. ఇదే విషయాన్ని విజయ భాస్కర్ కి చెప్పగా ... ఆయన దానికి ఓకే చెప్పి ... నీ దగ్గర ఉన్న రెండు కథలలో ఒకటి మనిద్దరం కలిసి చేద్దాం. మరొకటి నువ్వు సొంతగా వేరే హీరోతో చేసుకో అన్నాడట. దానికి ఆయన కూడా ఒప్పుకున్నాడట. ఇక ఆయన దగ్గర ఉన్న ఒక కథను విజయ భాస్కర్ కు వినిపించాడట.
అదే మన్మధుడు కథ. కథ వినగానే విజయ భాస్కర్ కి అది అద్భుతంగా నచ్చిందట. ఇక మన్మధుడు అనే టైటిల్ కూడా త్రివిక్రమ్ చెప్పడంతో నాగార్జున తో ఈ సినిమా చేద్దాం అని ఆలోచనకు వచ్చారట. అలా అని ఒక రోజు నాగార్జున ను కలిసి కథ వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పాడట. నిర్మాత ఎవరు అనే విషయం పై కాస్త కన్ఫ్యూజన్ ఉండగా టెన్షన్ అవసరం లేదు నేనే ఈ సినిమాను నిర్మిస్తారు అని చెప్పాడట. అలా సూపర్ ఫాస్ట్ గా ఈ సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సోనాలి బింద్రే , అన్షు అంబానీ హీరోయిన్లుగా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.