నవంబర్ అంతా బన్నీ ఫ్యాన్స్ కి పండగే.. ఏకంగా అన్ని అప్డేట్స్..?

Pulgam Srinivas
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాని మొదట ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఆ తర్వాత ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్ల అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ప్రచారాలను చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం విలేకరులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే రేంజ్ అప్డేట్లు ఉండబోతున్నట్లు ప్రకటించింది. నవంబర్ నెలలో ఈ సినిమా నుండి రెండు పాటలు మరియు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతానికి ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి కనుక హిట్ టాక్ వస్తే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి కొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: