రాజా సాబ్ కు కలసివచ్చిన కల్కి !

Seetha Sailaja
ప్రభాస్ పుట్టినరోజునాడు విడుదలైన ‘రాజా సాబ్’ మోషన్ పోస్టర్ కు మంచి స్పందన రావడంతో ఈ మూవీ నిర్మాతలు అదేవిధంగా దర్శకుడు మారుతి మంచి జోష్ లో ఉన్నారు. రెండు నిముషాల నిడివిలో ఉన్న ఈ మోషన్ పోస్టర్ లో ప్రభాస్ తన కెరియర్ లో మొట్టమొదటిసారి తెల్లని గడ్డం అక్కడక్కడా నెరిసిన జుత్తు అతడి నోట్లో పాత కాలం జమీందార్లు వెట్టుకునే చుట్టతో డిఫరెంట్ లుక్ తో కనిపించడంతో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా జోష్ లోకి వెళ్ళిపోయారు.

ఈ మోషన్ పోస్టర్ వీడియోలో ప్రభాస్ కు సంబంధించిణ లైవ్ విజువల్స్ లేకపోయినా ఈ మూవీ కథ ఒక హారర్ కాన్సెప్ట్ అన్న అర్థం అందరికీ వచ్చేసింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మోషన్ పోస్టర్ ను మరింత హైలెట్ చేసింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ఈమూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడా అన్న సందేహాలు మరికొందరిలో ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా కనిపించే ప్రభాస్ వింటేజ్ లుక్ వైరల్ కాగా ఇప్పుడు ప్రభాస్ ఓల్డ్ ఏజ్ లుక్ కూడ బయటపడటంతో ఈసినిమాకు సంబంధించిన కథను ఎవరి స్థాయిలో వారు ఊహించుకుని సోషల్ మీడియాలో ఆశక్తికర అంచనాలతో కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు మారుతి ఇలాంటి సబ్జెక్ట్ ను సినిమాగా మార్చడంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తూ ఉండటంతో ఈ మూవీ బిజినెస్ చాల బాగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వచ్చే సంవత్సరం ఏప్రియల్ లో విడుదలకాబోతున్న ఈమూవీ బిజినెస్ అత్యంత భారీ స్థాయిలో జరగడానికి ‘కల్కీ’ అందించిన సూపర్ సక్సస్  కూడ ఒక కారణం అని అంటున్నారు. ‘కల్కి’ మూవీ విడుదల తరువాత ఈమూవీ విడుదల అవుతున్న నేపధ్యంలో ‘కల్కి’ సూపర్ సక్సస్ బయ్యర్లలో ధైర్యాన్ని నింపడంతో ‘రాజా సాబ్’ మూవీకి అంచనాలు మించిన బిజినెస్ జరుగుతోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: