మెగాస్టార్: 'అడవిదొంగ' కోసం పెట్టిందెంతా...కొల్లగొట్టిందెంతా...తెలిస్తే షాకవ్వాల్సిందే.!

FARMANULLA SHAIK
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 1980’s, 90’s లో బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.. చిరు స్టార్‌డమ్‌ని పెంచిన, తెలుగు సినిమాని సత్తాని చాటిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.ఈ నేపథ్యంలో నెల రోజుల తేడాతో విడుదలైన రెండు చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి నట జీవితంలో గొప్ప మార్పు తెచ్చాయని చెప్పాలి. ఆ చిత్రాలు.. ‘అడవి దొంగ’, ‘విజేత’. ముఖ్యంగా ‘అడవి దొంగ’ చిత్ర విజయంతో చిరంజీవితోనూ భారీ చిత్రాలు నిర్మించవచ్చనే నమ్మకం అగ్ర నిర్మాతల్లో  కలిగింది. ఆ నాటి నంబర్ వన్ హీరో ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆయన అధిష్టించిన అగ్రాసనం ఖాళీ అయింది. అక్కినేని సహా పలువురు అగ్ర తారలు ఉన్నా, పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న హీరో కృష్ణ ఆ స్థానం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలోనే ‘ఖైదీ’ చిత్రం విడుదలైంది. ఆ సినిమాతో చిరంజీవికి ఓవర్ నైట్ స్టార్ డం వచ్చింది. ఎవరి అండదండలు లేకుండా కృషినే నమ్ముకొని ఎదిగిన చిరంజీవి ‘ఖైదీ’ తర్వాత మరికొన్ని జనరంజకమైన చిత్రాల్లో నటించి అభిమానుల సంఖ్య పెంచుకున్నారు. ఏడాది తిరగకుండానే హీరో కృష్ణతో పోటీ పడే స్థాయికి చేరుకొన్నారు. అటువంటి నేపథ్యంలో 1985లో విడుదలైన ‘అడవి దొంగ’ చిత్రం మెగాస్టార్ కెరియర్ గ్రాఫ్‌ను మరింత పెంచింది.ఎన్టీఆర్ తరానికి చెందిన భారీ చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు.. చిరంజీవితో చేతులు కలపడంతో ఆయన కెరీర్‌కు మరింత ఊపు వచ్చింది. సోలో హీరోగా చిరంజీవి,  రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన తొలి సినిమా ఇదే. 

మెగాస్టార్ చిత్రాల వ్యాపార పరిధిని బాగా పెంచి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. ఆ సమయంలో సూపర్ స్టార్‌గా వెలుగుతున్న కృష్ణ చిత్రాలకు సమానంగా ఈ సినిమా బిజినెస్ కావడం విశేషం.ఈ క్రమంలోనే ఈ మూవీకి రూ.50 లక్షలు బడ్జెట్ కాగా.. మొత్తంగా రూ.4 కోట్ల షేర్‌ని వసూలు చేసింది. అప్పట్లో ఈ మొత్తం బాగా ఎక్కువ. అడవి దొంగ మూవీ రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.80 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. అలాగే హైదరాబాద్‌లో ఏకంగా 5 థియేటర్లలో 5 షోలను ఏకధాటిగా చాలా రోజులపాటు ప్రదర్శించారు. ఇలా అడవిదొంగ మూవీ అప్పట్లో ఎన్నో రికార్డులను సృష్టించింది. చిరంజీవిని మెగాస్టార్‌గా నిలబెట్టడంలో దోహదపడింది.రాఘవేంద్రరావు మార్క్ పాటలతో, చిరంజీవి నృత్యాలతో ఒక సరికొత్త మాస్ కాంబినేషన్‌కు ‘అడవి దొంగ’ తెర తీసింది. చిరంజీవి సినిమాను ఎంత ఖర్చు పెట్టి తీసినా.. వసూళ్లకు ఢోకా ఉండదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. అలాగే ఎన్టీఆర్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి భారీ సినిమాలు తీయాలంటే చిరంజీవితోనే సాధ్యం అని ‘అడవి దొంగ’ తోనే ముందుకు రావడం మొదలైంది.ఈ సినిమాలో చిరంజీవి టార్జాన్ పాత్ర పోషించారు. ఇంటర్వెల్ వరకూ ఆయనకు మాటలే ఉండవు. ఈ విషయంలో రాఘవేంద్రరావు మెగా అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యారు కూడా. రాధ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 1985 సెప్టెంబర్ 19న విడుదలైంది. హైదరాబాద్‌లో దేవి, సత్యం, కోణార్క్, జ్యోతి థియేటర్లలో విడుదల చేశారు. విడుదల రోజున నాలుగు థియేటర్లలో ఐదు షోలు ప్రదర్శించడం హైదరాబాద్ సిటీ హిస్టరీ‌లో అదే తొలిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: