మోక్షాజ్ఞ సినిమాలో విలన్ గా స్టార్ హీరో.. నిజమైతే మాత్రం రికార్డులు బద్దలే?

praveen
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి, బాలయ్య అయితే పెద్దగా తొందర పడడంలేదుగానీ నందమూరి అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలయ్య కొన్నాళ్ల క్రితం తన కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే. తరువాత కొన్నాళ్లకే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాను ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్టు వినికిడి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆటోమేటిగ్గా ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా నటించబోయే హీరో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవును, మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి నటించబోతున్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి.
ఇక ఈ వార్తని విని నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో చూసుకుంటే, రానా హీరోగా కంటే విలన్ పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు. ఈయన విలన్ పాత్రలో చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడం మనకి తెలుసు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినిమాలో కూడా విలన్ పాత్రలో ఈయనే నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మోక్షజ్ఞ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కనుందని భోగట్టా. కాగా, మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బాలయ్య సొంత బ్యానర్ లో తెరకెక్కనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: