అమరన్ మూవీలో చూపించిన మేజర్ ముకుంద్ ఎవరు.. ఆయన డీటెయిల్స్ ఇవే?

praveen
హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి కాంబోలో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న సినిమా 'అమరన్' ట్రైలర్ తాజాగా రిలీజ్ కావడంతో ఈ సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. అక్టోబర్ 31న దీపావళి కానుకగా తమిళంతో పాటు ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఇక ఇది మేజర్ "ముకుంద్ వరదరాజన్" బయో పిక్ కావడంతో.. అందరికీ ఈ సినిమాపైన చాలా ఇంటరెస్ట్ పెరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది అసలు ఎవరు ఈ మేజర్ ముకుంద్? వార్లో ఎలా చనిపోయారు? ఎంతో మంది ఆర్మీ జవాన్ లు ఉండగా అతని స్టోరీని ఎందుకు సినిమాగా తీశారు? అని రకరాలుగా ఆలోచిస్తున్నారు. వారికోసమే ఈ రియల్ స్టోరీ.
మేజర్ ముకుంద్ వరదరాజన్ ఆర్ వరదరాజన్, గీత గార్లకు 1983 ఏప్రిల్ 12 న కేరళలో జన్మించడం జరిగింది. పుట్టింది కేరళలో అయినప్పటికీ చదువు మాత్రం చెన్నైలోనే ఎక్కువగా సాగింది. ముకుంద్ మామయ్య, తాతయ్య కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేసారు. దాంతో వాళ్ళ మామయ్య, తాతలాగా ఆర్మీలో చేరాలని ముకుంద్ అనుకున్నాడు. కానీ ముకుంద్ తల్లిదండ్రులకు మాత్రం అతను ఇండియన్ ఆర్మీకి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకనే వారికి ముకుంద్ ఒక్కగానొక్క కొడుకు. కానీ ముకుంద్ ఆర్మీపైన ప్రేమతో ఎలా అయినా ఆర్మీలో చేరాలని అప్లై చేశారు. కట్ చేస్తే, 2006లో రాజ్ పుత్ రెజిమెంట్ మిలట్రీ ఫోర్స్ లో లెఫ్టినెంట్ గా అపాయింట్ అయ్యారు ముకుంద్. అలా రెండేళ్ల తర్వాత కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాడు. ఈ క్రమంలో ముకుంద్ కాలేజ్ లో ప్రేమించిన ఇందు రెబెకా వర్గీస్ ను 2009లో పెళ్లి చేసుకున్నారు. ఆ ఫలితంగా వారికి 2011లో పండంటి ఓ కూతురు జన్మించింది.
ముకుంద్ కెప్టెన్ గా అటు ఆర్మీలో చాలా స్ట్రాంగ్ టీంను రెడీ చేసుకున్నారు. ఈ క్రమంలో చాలా ఆపరేషన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు. దాంతో 2012లో ఇండియన్ ఆర్మీ ఆయనను 44 రాష్ట్రీయ రైఫిల్స్ టీం లో జాయిన్ అవ్వమని కోరగా ముకుంద్ జాయిన్ అయ్యి, కొన్ని నెలల్లోనే మేజర్ పొజిషన్ స్థాయిని అందుకున్నారు. అక్కడే అతని కథ మలుపు తిరిగింది. 2014లో ఒక రోజు ఆర్మీ బేస్ కు ఒక కాల్ రాగా, సౌత్ కాశ్మిర్ దగ్గర ఒక విలేజ్ లో కొంతమంది ఉగ్రవాదులు ఆపిల్ ట్రీస్ దగ్గర ఉన్నారని తెలుసుకున్న అఫీషియల్స్ ముకుంద్ ను టీంతో సహా అక్కడకు వెళ్లి.. ఉగ్రవాదుల లీడర్ అయిన అల్తాఫ్ ను చంపి, అతని దగ్గర ఉన్న డిజిటల్ డాక్యుమెంట్స్ ను రికవరీ చేసుకురమ్మని ఆర్డర్ వేశారు. దాంతో ముకుంద్ ఏ మాత్రం లేట్ చేయకుండా ముకుంద్ తన టీమ్ తో కాశ్మిర్ వెళ్ళి, ఆ టీంని సరౌండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఉగ్రవాదులు వీరిపై దాడి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మేజర్ టీం ఆ ఉగ్రవాదిని కాల్చి.. తన దగ్గర ఉన్న మొబైల్ , డాక్యుమెంట్స్ తీసుకు వచ్చి ముకుంద్ కు ఇవ్వడంతో అల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు.
అలా వారు దాక్కున్న ఇంట్లోకి వెళ్ళి టీం మొత్తం ఉగ్రవాదుల మీదకు వీరోచితంగా కాల్పులు జరిపి వారిని చంపేశారు. కాసేపటి వరకు అక్కడ ఎలాంటి సౌండ్స్ రాకపోవడంతో.. మొత్తం చనిపోయి ఉంటారని లోపలి వెళ్ళిన మేజర్ ముకుంద్ పై అల్తాఫ్ కాల్పులు జరుపుతాడు. బుల్లెట్స్ దిగినా కూడా మేజర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా అతనిని తిరిగి చంపేస్తాడు. ఆ తరువాత అతని దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్ టాప్ ను తీసుకుని వారి టీం కు ఇచ్చి.. ఆపేరేషన్ సక్సెస్ అని చెప్పి అక్కడే కన్నుమూస్తాడు మేజర్. ఆ డిజిటల్ డేటాను డీకోడ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే.. ఆ ఉగ్రవాదులు జరగబోయే జమ్మూ & కాశ్మిర్ ఎలెక్షన్స్ ను టార్గెట్ చేశారు. అలా మేజర్ ముకుంద్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను చంపి.. ఇండియాను సేవ్ చేయడం జరిగింది. మేజర్ ముకుంద్ త్యాగానికి గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ 2015 జనవరి 26న 'అశోక చక్ర' అవార్డుని ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా తమిళ నాడు రాష్ట్రం నుంచి అశోక చక్ర అవార్డు పొందిన నాల్గవ వ్యక్తిగా మేజర్ ముకుంద్ అవతరించాడు. అతని నిశ్వార్ధమైన దేశభక్తికి దర్పణంగా 'అమరన్' మూవీని ఇపుడు తమిళ సినిమా పరిశ్రమ ప్రేక్షకులకి అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: