"రాజా సాబ్" కోసం ప్రభాస్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? కెరీర్ లోనే ఇది ఓ రికార్డ్..!

Thota Jaya Madhuri
ప్రభాస్ అంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్న విషయం అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న ఫస్ట్ హీరో ప్రభాస్ కావడం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని దున్నేస్తున్న ప్రభాస్ రీసెంట్గా తన 45వ పుట్టినరోజును.  చాలా చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు అంతేకాదు ఆయన నటిస్తున్న మూవీస్ కి సంబంధించిన పలు సినిమా డీటెయిల్స్ అనౌన్స్మెంట్స్ కూడా బాగానే ఫాన్స్ ను ఆకట్టుకున్నాయి .


కాగా మారుతి దర్కత్వంలో ప్రభాస్ నటిస్తున్న "రాజా సాబ్ " సంబంధించి ఒక స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీం.  అయితే ఈ సినిమాలో ప్రభాస్ ముసలి గెటప్ లో కనిపించబోతూ ఉండడం అందరికీ షాకింగ్ అనిపించింది . ఇది మొత్తం ఒక కామెడీ హర్రర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన సినిమా అంటూ క్లారిటీ ఇచ్చేశాడు మారుతి.  చిన్న వీడియోతోనే సినిమా స్టోరీ మొత్తం అర్థమైపోయేలా ఎన్నో ఎన్నో హింట్స్ ఇచ్చేశాడు మారుతి.


కాగా ఆ వీడియో చూశాకే ప్రభాస్ ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ ఓ  టాపిక్ ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో బడా బడా సినిమాలో నటించాడు. కానీ ఏ సినిమా కోసం ఇంత హెవీ మేకప్ వేసుకోలేదు . మరి ముఖ్యంగా ముసలి గెటప్ లో అస్సలు కనిపించలేదు . అయితే ఒక పాన్ ఇండియా స్టార్ ముసలి గెటప్ లో కనిపించడం మామూలు విషయం కాదు .ఆ కారణంగానే ప్రభాస్ సినిమాకి ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేశాడు అంటూ మాటలు వినిపిస్తున్నాయి.


అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం 70 లక్షల మాత్రమే రెమ్యూనరేషన్  అందుకున్నాడట . మిగతాది మొత్తం షేర్స్ తీసుకోవాలనుకుంటున్నారట . మనకు తెలిసిందే పాన్ ఇండియా స్టేట్స్ సంపాదించుకున్న ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి 100 - 150 కోట్లు అందుకుంటున్నాడు. అయితే మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎందుకు అంత తక్కువ తీసుకున్నాడు అంటే మాత్రం ఆయన ఫ్రెండ్షిప్ అని అంటున్నారు.  నిజంగానే ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ స్టార్ట్ అయ్యాక ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే ఫస్ట్ . ఇది ఆయన కెరియర్ లోనే ఓ రికార్డు అంటున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: