ఏంటయ్యా ప్రభాస్ ఇది.. ఊరించి ఊరించి ఉస్సురుమనిపించావే..!

Thota Jaya Madhuri
ప్రభాస్ అని పేరు ఎత్తగానే ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఆయన పెళ్లి గురించే. ఆయన ఫిక్స్ అయ్యిందా..? అమ్మాయి ఎవరు..? పెళ్లి డేట్ ఎప్పుడు..? ఇదే టాపిక్ మాట్లాడుకుంటారు. అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు.. ఫిలిం ఇండస్ట్రీ కాదు ..వ్యాపారస్తులు కాదు ..హౌస్ వైఫ్ కాదు.. ఎవ్వరైనా సరే ప్రభాస్ గురించి చెప్పగానే ముందుగా మాట్లాడుకునేది ఆయన పెళ్లి టాపిక్ నే.  అంత హాట్ టాపిక్ గా ఆయన పెళ్లి న్యూస్ మారిపోయింది .


అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు ప్రభాస్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ బిహ్ హింట్ ఇవ్వడంతో  ఆ న్యూస్ మరింత స్థాయిలో వైరల్ గా మారింది . అందరూ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తారు అని.. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు..? ఏం చేస్తూ ఉంటుంది..? నిశ్చితార్ధం డేట్ ఎప్పుడు ..? అన్నది ఆల్మోస్ట్ చెప్పేస్తారు అని అనుకున్నారు . ప్రభాస్ బర్త్డ డే కన్నా మంచి ముహూర్తం ఏముంటుంది..? అంటూ కూడా రెబల్ ఫ్యాన్స్ కూడా ఆశపడ్డారు .


సీన్ కట్ చేస్తే ప్రభాస్ అసలు పెళ్లి  ఊసే ఎత్తలేదు . ప్రభాస్ కి సంబంధించిన పెళ్లి విషయం అప్ డేట్ వస్తుందని ఎంతో  ఆశపడ్డ ఫ్యాన్స్ కు అది నిరాశగానే మిగిలింది. అంతేకాదు "రాజా సాబ్" అదే విధంగా "స్పిరిట్" నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి . అంతేకాదు ప్రభాస్ పెళ్లిపై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ పై కూడా ఫాన్స్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కొంతమంది ఏకంగా "ఏంటయ్యా ప్రభాసి ఇది ..అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావా..? లేదా..? చేసుకుంటాను అంటే చేసుకుంటాను అని చెప్పు.. లేదంటే లేదని చెప్పేయ్ ..ఈ ఫ్యాన్స్ కి టెన్షన్ ఏంటి ..?"అంటూ ఓపెన్గానే మాట్లాడుతున్నారు. మరి ప్రభాస్ ఇప్పటికైనా తన పెళ్లి పై ఏదైనా అప్డేట్ ఇస్తాడో లేదో చూడాలి..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: