పుష్ప కోసం దేవర.. బన్నీ రిక్వెస్ట్ కు టైగర్ ఓకే..?

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు హీరోల రూటు మాత్రం సపరేట్.. మిగిలిన హీరోల రూట్ డిఫరెంట్.. ఆ ఇద్దరు హీరోలే ఎన్టీఆర్ - అల్లు అర్జున్.. ఈ ఇద్దరినీ ఇప్పుడు మెగా అభిమానులు పగబట్టి మరి ట్రోల్ చేయడం టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు టాలీవుడ్ లో ఉన్న ప్రభాస్ , పవన్ కళ్యాణ్ , మహేష్ ఫ్యాన్స్ కూడా వీరిని ఓ రేంజ్ లో ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. నిన్నటి వరకు ఎన్టీఆర్ దేవర సినిమాను ట్రోల్ చేయగా ఇప్పుడు పుష్ప 2 ను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.. వాటిని తట్టుకుని దేవ‌ర‌ నిలబడి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఆ దెబ్బకి ఎన్నో సినిమాలు రికార్డులు కనుమరుగైపోయాయి. దేవర తో ఎన్టీఆర్ కొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు పుష్ప2 వంతు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా పై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతుంది. పుష్ప‌ మొదటి భాగం టైంలో కూడా సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ తో సినిమాపై చాలా చెలరేగిపోయారు మెగా అభిమానులు. ఇక ఇప్పుడు పుష్ప‌2 విషయంలో కూడా అలాగే ట్రోల్ చేయాలని భావిస్తున్నారు. అయితే దీనికి అల్లు అర్జున్ ప్లానింగ్ ఎవరు ఊహించిన విధంగా ఉందని తెలుస్తుంది. బన్నీకి ఇప్పటికే వైసీపీ నుంచి సపోర్ట్ గట్టిగా లభిస్తుంది . తమ హీరోగా అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో అల్లు అర్జున్ కోసం నిలబడుతున్నారు .. అందుకే ఇప్పుడు పుష్ప 2 ప్రి రిలీజ్ ఈవెంట్ ను గట్టిగా ప్లాన్ చేయడమే కాకుండా ఆహాలో ప్రాసరమై అన్ స్టాపబుల్ షో లో కూడా ఇంటర్వ్యూ గట్టిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు రెండు గా ప్లాన్ చేస్తున్నారట . ఒకటి ముంబైలో.. రెండోది రాయలసీమలో ఉంటుందని తెలుస్తుంది. అక్కడి మీడియాలో కూడా ఓ రేంజ్ లో హైప్ వస్తుందని భావిస్తున్నారు. తిరుపతి లేదా చిత్తూరులో ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ ఈవెంట్ కు రజనీ కాంత్, ఎన్టీఆర్ ను ఆహ్వానించే ఛాన్స్ ఉంది. రజనీ కాంత్ ను ఫాహాద్ ఫాజిల్ ఆహ్వానిస్తాడని టాక్ . ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తే కచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైప్ వస్తుంది. సినిమాకు భారీ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది .
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: