ప్రభాస్ హను మూవీ డిజిటల్ రైట్స్ లెక్కలివే.. పుష్ప2 ను క్రాస్ చేయలేదు కానీ?

Reddy P Rajasekhar
ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీ ఫౌజీ అనే క్రేజీ టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 150 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
 
ప్రబాస్ హను రాఘవపూడి కాంబో మూవీ డిజిటల్ హక్కుల విషయంలో పుష్ప ది రూల్ ను క్రాస్ చేయలేదు కాని 150 కోట్ల రూపాయలు అంటే రికార్డ్ అనే చెప్పాలి. ప్రభాస్ హను మూవీపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతుండగా ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సీతారామం తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదేననే సంగతి తెలిసిందే.
 
అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేసే భారీ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ సైతం ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. స్పిరిట్ సినిమా కంటే ముందే ప్రభాస్ ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ప్రభాస్ కు ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
 
ప్రభాస్ క్రేజ్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో 2025లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదలైన రాజాసాబ్ మూవీ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ లుక్స్ కు ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పుష్ప2 మూవీ డిజిటల్ రైట్స్ ను అయితే ఈ సినిమా క్రాస్ చేయలేదనే సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: