ప్రభాస్ కోసం 40 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకొని స్టార్ హీరోయిన్లు.. ఎవరో తెలుసా?
ఈ మధ్య ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ ఎంతో వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా ప్రభాస్‌ను ప్రేమించిన ఇద్దరు హీరోయిన్లకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే ప్రభాస్‌ను నమ్ముకుని ఆయన్ని ప్రేమిస్తూ ప్రభాస్ లాగే బ్యాచ్‌లర్ లైఫ్‌ను కొనసాగిస్తున్నారు ఇద్దరు స్టార్ హీరోయిన్లు. అయితే వారు ప్రభాస్‌ను ప్రేమించారో లేదో తెలియదు కానీ 40 సంవత్సరాలు వచ్చినా కూడా బ్యాచిలర్ గానే ఉంటున్నారు. ఇక ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే త్రిష - అనుష్క .. యస్ ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రభాస్‌తో ప్రేమలో ఉన్నారట. అందుకే బ్యాచిలర్ గానే ఇప్పటికీ లైఫ్ కొనసాగిస్తున్నారు. అయితే వీరిలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అమెరికాలో ఇద్దరు ఇల్లు కూడా కొన్నారని పెళ్లి తర్వాత అక్కడికి వెళ్ళిపోతున్నారని రూమర్లు కూడా వచ్చాయి. అయినా కానీ వీరు ఏమాత్రం ఈ విషయంలో స్పందించలేదు . ఇక ప్రభాస్ - అనుష్క బిల్లా , మిర్చి , బాహుబలి సినిమాల్లో నటించి మెప్పించారు.
ఇక త్రిష కూడా ప్రభాస్‌ను ప్రేమించిందని టాక్ ఉంది.. ఈమెకు కూడా 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు.. ఇప్పటికే సింగిల్‌గానే ఉంటుంది. అలాగే హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఏకైక హీరోయిన్ త్రిష. ఇక ఏమే ప్రభాస్ తో వర్షం , పౌర్ణమి , బుచ్చిగాడు సినిమాలో నటించింది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అలాగే టాలీవుడ్లో చిరంజీవికి జంటగా విశ్వంభర సినిమాల్లో నటిస్తుంది త్రిష. ఇలా అనుష్క - త్రిష ఇద్దరూ ప్రభాస్ ని ప్రేమించారని అందుకే ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారని అంటున్నారు.