మెగా హీరోలను వెనక్కి నెట్టేసి షాకిచ్చిన బాలీవుడ్ సర్వే..!

FARMANULLA SHAIK
ఒకప్పుడు టాలీవుడ్ అంటే నార్త్ ప్రేక్షకులు చాలా తక్కువగా చూసేవారు. సౌత్ సినిమాలు అంటే రొటిన్ ఫైట్స్, పాటలు, లాజిక్ లెస్ అంటూ కామెంట్స్ చేసేవారు. ఇక బహుబలి సిరీసుతో వాటన్నింటికి రాజమౌళి చెక్ పెట్టేశాడు. టాలీవుడ్ పేరు ఇప్పుడు దేశ విదేశాల్లో వినిపిస్తుంది. ఇక్కడి స్టార్స్ గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు. అయితే ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సంస్థ సీని ప్రముఖుల గురించి సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా ఇండియాలో టాప్ హీరో ఎవరు అనేదానిపై ఆర్మాక్స్ సర్వే నిర్వహించి.. ఆ లిస్టును సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇండియాలో టాప్ 10 హీరోల జాబితాలో టాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు.ఈ నేపథ్యంలోఆర్మాక్స్ రిలీజ్ చేసిన ఇండియాలో టాప్ 10 హీరోల జాబితా ఇదే. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ని ఏలారు. ఈ మధ్య ఆయన విజయాల పరంగా వెనుకబడ్డారు. దాంతో సల్మాన్ ఖాన్ కి టాప్ 10 పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చివరి స్థానం దక్కింది. ఇక రామ్ చరణ్ 9వ స్థానంలో నిలిచాడు. 

అక్షయ్ కుమార్ కి ఈ సర్వే ప్రకారం పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో 8వ స్థానం లభించింది. మహేష్ బాబుకి ఆడియన్స్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో 7వ స్థానం కట్టబెట్టారు. ఈ విధంగానే అల్లు అర్జున్ కి 6వ స్థానం దక్కింది.ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కాగా ఇదే సినిమాలో హీరోగా చేసిన రామ్ చరణ్ మాత్రం ర్యాంకింగ్ లో వెనుకబడ్డాడు. ఎన్టీఆర్ కి 5వ స్థానం దక్కింది. దేవర మూవీతో మరోసారి నార్త్ లో ఎన్టీఆర్ సత్తా చాటాడు. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అనూహ్యంగా అజిత్ కుమార్ 4వ స్థానం దక్కించుకున్నాడు.కాగా షారుఖ్ ప్రస్తుతం 3వ ర్యాంక్ లో ఉన్నాడు. గతంలో ఆయన ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. కల్కి మూవీతో ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు.

ఇక పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో ర్యాంక్ విజయ్ కి దక్కింది. ఆయన గత చిత్రం గోట్ డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ గోట్ కి కనీస ఆదరణ దక్కలేదు. అలాగే విజయ్ కి ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు. అయితే ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.హీరో విజయ్ ఇండియాలో టాప్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇవండీ ఇండియాలో టాప్ 10 హీరోల జాబితా.ఇక ప్రస్తుతం పార్టీప్రకటించిన విజయ్ త్వరలో కార్యచరణ్ మొదలెట్టబోతున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ.. విజయ్ పార్టీ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక 2026 ఎన్నికలు టార్గెట్ విజయ్ పార్టీ ముందడుగు వేయబోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: