అబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..ఆ పాన్ ఇండియా సినిమాతో పలకరించబోతున్న తరుణ్..!?

Thota Jaya Madhuri
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా మారిన నటీనటులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా చాలామంది స్టార్ హీరోయిన్స్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో రీ ఎంట్రీ ఇస్తుండడం గమనార్హం. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారా..? అంటే నో అనే చెప్పాలి . వాళ్ళలో కొంతమంది మాత్రమే హిట్స్ అందుకోగలిగారు . మరి కొంతమంది అలా మెరిసి ఇలా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు.


అయితే సెకండ్ ఇన్నింగ్స్  ఎక్కువగా ఆడవాళ్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు . మగవాళ్ళు చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. తాజాగా ఆ లిస్టులోకి యాడ్ అయిపోయాడు  అందరి చేత లవర్ బాయ్ అని  పిలిపించుకున్న హీరో తరుణ్ . హీరో తరుణ్ గురించి  ప్రత్యేకంగా చెప్పాలా..?  చైల్డ్ ఆర్టిస్ట్.. మహానటుడే. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా క్రియేట్ చేయించుకున్నాడు. అప్పట్లో అమ్మాయిలు తరుణ్ ఫోటోను బుక్స్ లో పెట్టుకొని ఓ రేంజ్ లో లవ్ చేసేసేవాళ్ళు .


ఆ లిస్టులో చాలామంది అమ్మాయిలే ఉంటారు . కాగా ఎప్పటినుంచో తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు . కానీ సరైన కథ దొరక్క మంచి సినిమా అవకాశం రాక సైలెంట్ గా ఉండిపోయాడు అంటూ వార్తలు వినిపించాయి . కాగ రీసెంట్ గా సోషల్ మీడియాలో తరుణ్ కు సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాలో తరుణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట . అయితే మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాదని కానీ సినిమాలో ఈయన పాత్రికి చాలా ప్రాధాన్యం ఉంటుంది అని తెలుస్తుంది . ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు తరుణ్ తీసుకున్న డెసిషన్ కి నందమూరి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు . మంచి సినిమాను చూస్ చేసుకున్నావ్ బ్రో అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: