మత్తు కళ్ళతో మాయ చేసే ఐశ్వర్య ఇన్స్టాలో ఫాలో అవుతున్న ఏకైక స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతుంది .. ఐశ్వర్యరాయ్ తన భర్త తో కలిసి కొన్ని ఫోటోలను కూడా గతంలో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఐశ్వర్య అక్టోబర్ 22న తన తల్లి కుమార్తె ఆరాధ్యతో సహా తన కుటుంబంతో కజిన్ పుట్టినరోజు పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది . ఈ ఫోటోలను ఐశ్వర్యారాయ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. ఆ ఫోటోలు అభిషేక్ బచ్చన్ ఎక్కడ కనిపించలేదు .. దీంతో విడాకులు వార్తలకు మరింత బలం చేకూర్చింది .
ఇక ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ 20 ఏప్రిల్ 2007న వివాహ బంధంతో ఏకమయ్యారు. పెళ్లయిన 4 సంవత్సరాల తరువాత, ఈ దంపతులకు ఆరాధ్య జన్మించింది. ఆరాధ్యకు 12 ఏళ్లు నిండాయి. ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ తన కూతురి ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ఎప్పుడూ తన తల్లితోనే కనిపిస్తుంది. కాగా ఆరాధ్యకు కూడా అమ్మ అందమే వచ్చిందని.. తను పక్కాగా హీరోయిన్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.