అల్లు అర్జున్ కు గుడ్ న్యూస్.. ఆ కేసు నుంచి బిగ్ రిలీఫ్..!
అయితే ఈ పిటిషన్ ఈ రోజున విచారణకు రావడంతో ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబర్ 6 వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తీసుకోకూడదంటూ కోర్టు తెలియజేసింది.అలాగే ఈ కేస్ కు సంబంధించిన తుది తీర్పు కూడా నవంబర్ ఆరవ తేదీని విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రేకులు పడే సమయానికి నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్ప రవిచంద్ర విజయాన్ని అందించాలని అల్లు అర్జున్, వైసీపీ నేత ఇంటికి వెళ్లి మరి పలకరించడంతో పాటు అభిమానులను తన స్నేహితుడిని గెలిపించాలని కోరడం జరిగింది. అయితే అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నారని తెలుసుకొని అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు.
దీంతో పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ముఖ్యంగా ఈ విషయం పైన ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాలకు రావడంతో పాటు వైసిపి నేత శిల్ప రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఆధారంగా పోలీసులు అటు శిల్ప రవి పైన అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయడం జరిగింది.సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 71/2024 కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ అంశం ఇప్పుడు ఐ హోట్ అల్లు అర్జున్క సైతం గుడ్ న్యూస్ ని తెలియజేసింది.