తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఎంతటి స్థాయికి ఎదిగారో మనందరికీ తెలుసు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి ఇండస్ట్రీకే పెద్దన్నలా మారారు. అలాంటి ఆయన ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు అని చెప్పవచ్చు.. అయితే చిరంజీవి మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. అంతేకాదు నటనలో భాగంగా ఒక వ్యక్తి చిరంజీవి కాళ్లు పట్టుకుంటే, ఆ చిరంజీవి కాళ్ళు పట్టుకుంటావా అంటూ అవమానించారట.. మరి చిరంజీవి కాళ్లు పట్టుకున్నది ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం.. చిరంజీవి కెరియర్ లో ఎంతో హిట్ అయిన చిత్రాల్లో స్వయంకృషి,ఆపద్బాంధవుడు, రుద్రవీణ వంటి సినిమాలు ఉన్నాయి.
ఇందులో ఆపద్బాంధవుడు చిత్రం నటన పరంగా చిరంజీవికి ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టింది.
అయితే అలాంటి ఈ చిత్రం కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చింది. అయితే ఈ సినిమాకి జంధ్యాల డైలాగ్ రచయితగా పనిచేశారు. అలాంటి ఆపద్బాంధవుడు చిత్రంలో కీలకమైన స్కూల్ టీచర్ పాత్ర ఒకటి ఉంటుంది. అయితే ఈ పాత్రకు ఎవరు సెట్ అవుతారని చిత్ర యూనిట్ వెతుకుతున్న తరుణంలో జంధ్యాల అయితే బాగుంటుందని అందరూ భావించారట. వెంటనే కె. విశ్వనాథ్ ఈ పాత్ర గురించి జంధ్యాలకు చెప్పగానే, మీరు అడిగితే నేను కాదంటానా అంటూ ఒప్పేసుకున్నారట. అయితే ఈ చిత్రంలో జంధ్యాల తనకంటే చిన్నవాడైనటువంటి చిరంజీవి కాళ్లు పట్టుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది.. అయితే ఈ పాత్ర గురించి చిరంజీవి కూడా చాలా బాధపడ్డారట.
అంత పెద్దాయన నా కాళ్లు కట్టుకోవడం ఏంటని అనుకున్నారట. అయితే ఈ పాత్ర పై జంధ్యాల తల్లి చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. జంధ్యాల చిరంజీవి కాళ్ళు పట్టుకునే సన్నివేశం చేశారని తన తల్లి తెలుసుకొని విపరీతంగా తిట్టిందట. అంతేకాదు ఇందులో జంధ్యాల పాత్ర మరణిస్తుంది. నువ్వు ఇంత పెద్ద స్థాయిలో ఉండి చిరంజీవి కాళ్ళు పట్టుకోవడమే కాకుండా అలాంటి పాత్రలో చేస్తావా అంటూ తల్లి దారుణంగా తిట్టిందట. అయితే ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో జంధ్యాల సతీమణి సరదాగా తెలియజేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియలో వైరల్ అవుతుంది.