అబ్బాస్ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపిన హీరో. యూత్ లో ఆయన ఎంతో క్రేజ్ నింపారు. ఆయన స్టైల్ నటన తీరును ఎంతో మంది ఫాలో అయ్యారు. అలాంటి అబ్బాస్ తెలుగు ఇండస్ట్రీలోకి ప్రేమదేశం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన ఓవర్ నైట్ లోనే స్టార్డం సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగి ఆ తర్వాత కొన్నాళ్లకే ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయారు. అలా దూరం అవ్వడానికి కారణం ఏంటి.. ఆయన లవ్ స్టోరీ ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. గత 30 సంవత్సరాల క్రితం అబ్బాస్ పేరు యువతలో ఎంతో ఉండేది. లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఈయన హెయిర్ స్టైల్ ను ఇప్పటికీ ఎంతో మంది ఫాలో అవుతారు. అలా కుర్రకారును ప్రేమదేశం అనే సినిమా ద్వారా ఎంతో మెస్మరైజ్ చేసిన అబ్బాస్ ఎంతో మంది యువతకు రోల్ మోడల్.
అప్పట్లో ఈయన సినిమా చూసిన చాలామంది యువత అమ్మాయిలతో ప్రేమలో పడేవారు.. ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన అబ్బాస్ కొన్నాళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయి చివరికి దేశం వదిలి వెళ్ళిపోయారు.. అక్కడ వివిధ రకాల వర్క్ లు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.. అలాంటి అబ్బాస్ ముందుగా పైలెట్ అవుదామని అనుకొని చివరికి సినిమా రంగంలోకి అడుగు పెట్టారట. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమదేశం.. ఈ సినిమాలో ఆయనతో పాటు వినీత్ హీరోగా చేశారు. ఇందులో టబూ కథానాయికగా చేసింది.
అయితే ఈ చిత్రంలో టబూ వినీత్ అబ్బాస్ మంచి కాలేజీ ఫ్రెండ్స్.. ఇందులో అబ్బాస్ టబుని గాఢంగా ప్రేమిస్తాడు. అంతేకాకుండా వినీత్ కూడా టబుని ప్రేమిస్తాడు. అలా ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించి గొడవలు పెట్టుకుని ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుంటారు. అలా అద్భుతమైన కథతో సాగిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ సాధించింది. ఈ విధంగా అబ్బాస్ సినిమాలోనే కాకుండా బయట కూడా టబును గాఢంగా ప్రేమించారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు