ధనుష్ విషయంలో రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం !
ఇది ఇలాండగా తమిళ దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘జైలర్’ మూవీకి సీక్వెల్ తీయాలని ఒక పవర్ ఫుల్ కథను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రజనీకాంత్ తన అనారోగ్యం నుండి కోలుకుని ‘కూలీ’ షూటింగ్ లో వచ్చేనెల నుండి పాల్గొనబోతున్నాడు. డాక్టర్ల సలహా మేరకు సినిమాలు చేస్తూనే మరొకవైపు తన ఆరోగ్యం పట్ల కూడ రజనీకాంత్ శ్రద్ద వహిస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితుల మధ్య నెల్సన్ రజనీకాంత్ ను కలవడం అతడికి ‘జైలర్ 2’ కథను వినిపించడం జరిగింది అంటున్నారు. ‘జైలర్’ మూవీలో రజనీకాంత్ తన సొంత కొడుకు అన్యాయాలు చేస్తున్నాడని చంపేస్తాడు. ఇప్పుడు ‘జైలర్ 2’ లో పిల్లలు లేక ఏకాంతంగా బాధతో ఉన్న రజనీ వద్దకు ఒక యువకుడు రావడం అతడు రజనీకాంత్ తో కలిసి ఏమి చేశాడు అన్న పాయింట్ చుట్టూ ‘జైలర్ 2’ కథను నెల్సన్ అల్లినట్లు సమాచారం.
అయితే ఆ యువకుడి పాత్రకు తమిళ హీరో ధనుష్ అన్నివిధాల సరిపోతాడని భావించినప్పటికీ ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తో విడాకులు తీసుకున్న నేపధ్యంలో రజనీకాంత్ ధనుష్ తో కలిసి నటించడానికి ఒప్పుకుంటాడా అన్న భావనతో నెల్సన్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈవిషయాన్ని గ్రహించిన రజనీకాంత్ మాత్రం తనకు ధనుష్ తో నటించే విషయం లో ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడంతో ఇప్పడు జైలర్2 షూటింగ్ త్వరలో ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి..