పెద్ద కాంట్రవర్సీ సృష్టించిన పవన్ మూవీ టైటిల్.. లాస్ట్ ట్విస్ట్ మాత్రం..?

Suma Kallamadi
* పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ కాంట్రవర్సీలో చిక్కుకోవడం కొత్తేం కాదు
* కొమరం పులి తర్వాత తీన్మార్ టైటిల్ పై వివాదం  
* ఈ వివాదం పెద్దదిగా మారినా సరే చివరికి అదే టైటిల్ కంటిన్యూ
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "తీన్మార్" సినిమా పేరుపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి. పరాంజీ డైరెక్ట్ చేసిన "తీన్మార్" సినిమా టైటిల్ పై తెలంగాణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముందు కూడా పవన్ కళ్యాణ్ నటించిన "కొమరం పులి" మూవీ టైటిల్ పై ఇలాంటి వివాదం తలెత్తింది. ఆ సమయంలో కూడా తెలంగాణ కార్యకర్తలు ఫిలిం మేకర్స్‌ను టైటిల్ ను "పులి"గా మార్చాలని ఒత్తిడి చేశారు. తరువాత "తీన్ మార్" చిత్రం టైటిల్ పై కూడా ఇదే విధమైన వివాదం రాజుకుంది.
వరంగల్ రవి అనే వ్యక్తి తన "తీన్మార్" కల్చరల్ అసోసియేషన్ తరపున ఈ సినిమా పేరు తెలంగాణ సంప్రదాయ నృత్యంతో పోలి ఉందని ఆరోపించారు. ఈ కారణంగా సినిమా పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంటిపై దాడి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. ఈ టైటిల్ వివాదం మరింత తీవ్రమైందే తప్ప అసలు తగ్గలేదు. సినిమా పాటలు విడుదలై సినిమాపై ఆసక్తి పెరిగిన సమయంలోనే ఈ వివాదం తలెత్తడం సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలిగించింది.
వరంగల్ రవి తన కులం వారు ఈ 'తీన్మార్' అనే పదాన్ని ఎప్పటి నుంచో వాడుతున్నారని, అది వారి సంస్కృతికి సంబంధించినదని వాదించారు. ఆ పదాన్ని ఇతరులు, ముఖ్యంగా సినిమా పేరుగా వాడటానికి వీల్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆయన కులం వారు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ వివాదం కారణంగా ఉస్మానియా విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. సినిమా నిర్మాత బండ్ల గణేష్ ఈ వివాదాన్ని ఎలాగోలా పరిష్కరించారు. ఇదే పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇంత స్ట్రగుల్ చేసే ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చిన నిర్మాతలకు నిరాశ ఎదురయింది ఎందుకంటే ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఇందులో నటించిన ఒక నటిని పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: