గ్యాంగ్ లీడర్ గా వచ్చిన నాని.. టైటిల్ విషయంలో పెద్ద రచ్చే జరిగిందిగా..!!

murali krishna
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గతంలో న‌టించిన గ్యాంగ్‌లీడర్‌`మూవీ ఎంతటి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గ్యాంగ్ లీడర్ సినిమాతో చిరంజీవి మాస్ ఇమేజ్‌ మరింత రెట్టింపు అయింది.. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తుంది.. అలాగే విజయశాంతితో బాస్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది.. ఇలా ఆరోజుల్లో మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ సినిమా సంచలనం సృష్టించింది..అయితే అంతటి బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్‌ను నేచుర‌ల్ స్టార్ నాని త‌న 24వ సినిమాకు పెట్టుకున్నాడు.. విక్ర‌మ్ కే కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ క‌థ‌కు `గ్యాంగ్‌లీడ‌ర్‌ టైటిల్ అయితేనే క‌రెక్ట్‌గా స‌రిపోతుంద‌ని భావించి ఇలా చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది..అయితే ఆ టైటిల్ విషయంలో మెగా ఫ్యాన్స్ కి, నానికి మధ్య పెద్ద వివాదమే జరిగింది.

ఇదిలా ఉంటే తమ టైటిల్ ని చట్ట విరుద్దంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మాణిక్యం మూవీస్ వారు ప్రెస్ మీట్ పెట్టి మరి నాని సినిమాను ఏకి పారేశారు. ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌ను మేము ఫిల్మ్ చాంబర్‌లో 6 నెలల క్రితమే  రిజిస్టర్ చేయించడం జరిగింది. నేను చిరంజీవిగారి వీరాభిమానిని. ఆ టైటిల్ అనుకున్న తర్వాతనే మేము కథ సిద్ధం చేసుకున్నాం.ఈలోపు చట్ట విరుద్దంగా టైటిల్‌ను కాజేసే ప్రయత్నం చేసారు. ఈ విషయాన్ని ఫిల్మ్ చాంబర్ పెద్దల ముందుకు తీసుకొచ్చాము. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తోనే సినిమా నిర్మిస్తామని హీరో, నిర్మాత మోహన్ కృష్ణ అన్నారు.అయితే నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు టైటిల్ ఇష్యూ రాకుండా టైటిల్ లో nani’s గ్యాంగ్ లీడర్ అని ఉంచడంతో సినిమాపై వివాదం  సద్దుమనిగింది.. అయితే టైటిల్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ నాని మీద గుర్రుగానే వున్నారు.. అలాంటి పవర్ ఫుల్ టైటిల్ ని ఇలాంటి సినిమాకి వాడుకుంటారా అని మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: