గతంలో వేరే ఏదైనా భాష సినిమా తమిళ్లో విడుదల అయితే కచ్చితంగా ఆ సినిమా యొక్క టైటిల్ తమిళ భాషకు లోనే ఉండాలి అనే ఎక్కువ శాతం డిమాండ్లు వినబడేవి. అందుకు అనుగుణం గానే ఏదైనా ఇతర భాష సినిమాను తమిళ్ లో విడుదల చేసినప్పుడు వారికి అనుగుణంగా టైటిల్స్ ను పెట్టేవారు. ఇక ఈ మధ్య కాలంలో కాస్త తమిళ్ వాళ్ళు ఆ విషయంలో వెనక్కు తగ్గారు. ఇకపోతే తమిళ్ వాళ్ళు మాత్రం తెలుగులో దాదాపు వారి నేటివిటీకి తగ్గ టైటిల్స్ తోనే ఇక్కడ సినిమాలు విడుదల చేస్తూ వస్తున్నారు.
ఇకపోతే కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా మంజు వారియర్ హీరోయిన్గా టి జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయన్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ టైటిల్ తమిళ నేటివిటీకి సంబంధించిన పదం. ఇక ఈ సినిమాను అదే టైటిల్ తోనే తెలుగులో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనితో టాలీవుడ్ సినీ ప్రేమికుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వెట్టయన్ అనే పేరు తమిళ నేటివిటీకి సంబంధించింది. దానిని అలాగే తెలుగులో విడుదల చేస్తే ఎలా .? తెలుగు నేటివిటీకి తగ్గ పదాలను పెడితే బాగుంటుంది కదా అనే ప్రతిపాదనలు కొంత మంది సూచించారు. ఇక ఆ చర్చ పెద్దది కావడం వల్ల ఈ సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు అయినటువంటి దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించి ఆ సినిమాను ఆ టైటిల్ తో తెలుగులో ఎందుకు విడుదల చేస్తున్నారు అనే దానిని తెలియజేశాడు.
ఆయన అందులో మాట్లాడుతూ ... వేట్టయన్ మూవీని తెలుగులో వేటగాడు అనే టైటిల్ తో విడుదల చేయాలి అనుకున్నారు. కానీ అప్పటికే ఆ టైటిల్ యొక్క హక్కులు వేరే వారి దగ్గర ఉన్నాయి. దాని కోసం ప్రయత్నించిన అవి దొరకలేదు. దానితో వెట్టయన్ ది హంటర్ అనే పేరుతో తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము అని ఆయన ప్రకటించాడు. ఇక ఇప్పటికే సినిమా విడుదల కావడం కూడా జరిగింది.