అన్‌స్టాప‌బుల్ 4 : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పొత్తు ఎలా పొడిచిందంటే...!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు పెట్టుకున్నాయి. అప్పటికే జనసేన - బిజెపి మిత్ర పక్షాలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కూడా ఈ రెండు పార్టీలతో జుట్టు కట్టి కూటమిగా ఏర్పడింది. కూటమి పార్టీలు మూడు కలిసి ఏకంగా 164 సీట్లతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాయి. ఇది కనివిని ఎరుగని మెజార్టీ అని చెప్పాలి. అయితే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఎలా కలిశారు ?  వీరిద్దరి మధ్య పొత్తు ప్రతిపాదన ఎలా ?వచ్చింది ? జనసేన టిడిపిలో కలవాలని నిర్ణయం ఎలా జరిగింది ? అన్నదానిపై తాజాగా చంద్రబాబు బాలయ్య తో అన్‌స్టాప‌బుల్‌ ఎపిసోడ్లో క్లారిటీ ఇచ్చారు.

ప‌వ‌న్ ఓసారి విశాఖపట్నం వెళ్లార‌ని అక్కడ పవన్ కళ్యాణ్ ను దిగనీయకుండా హోటల్లోనూ ఉండటానికి వీలు లేదంటూ బహిష్కరించారు. దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే విజయవాడ వచ్చారు . . ఓ నాయకుడిగా తానే స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలియజేసి అండగా ఉంటానని చెప్పాను .. ఆ తర్వాత నాకోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాబోతుంటే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయించారు .. రోడ్డు మార్గంలో వస్తుంటే ఆపేశారు .. నన్ను కలవనీయకుండా కట్టడి చేశారు .. తర్వాత నేను జైల్లో ఉన్నప్పుడు మీరు ( బాలకృష్ణ ను ఉద్దేశించి ) లోకేష్ - పవన్ కలిసి వచ్చారు.

అక్క‌డ పవన్ కళ్యాణ్ తో రెండు నిమిషాలు మాట్లాడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల‌నీయకుండా ప్రయత్నిస్తానని చెప్పారు .. కలిసి పోటీ చేద్దామని అంశాన్ని నేనే ముందు ప్రస్తావించాను అనుకుంటున్నా ఆలోచించి చెప్పమన్నాను .. ఆయన ఓకే అన్నారు .. భాజపాతో కలిసి అల‌యెన్స్‌ తీసుకొస్తామని చెప్పారు. బయటకు వచ్చాక ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఆ విషయాన్ని ప్రకటించారు. మన విజయానికి అదే నాంది అయిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఈ షోలో చంద్రబాబు తన జైలు జీవితం ఎన్నికల్లో ఘనవిజయం .. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిపాలన పై ఎన్నో అంశాలు పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: