తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా తారక్ దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.
సెప్టెంబర్ 27 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ సినిమా సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే సీడెడ్ ఏరియాలో ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన తెలుగు మూవీ ల లిస్టులో ఆర్ ఆర్ ఆర్ మూవీ 51.01 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉంది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఇక ఆ తర్వాత బాహుబలి పార్ట్ 2 సినిమా 34.75 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో ఉంది. ఇకపోతే దేవర పార్ట్ 1 మూవీ నాలుగు వారాల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 31.26 కోట్ల కలెక్షన్లతో సీడెడ్ ఏరియాలో వసూలు చేసి మూడవ స్థానంలో ఉంది.
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు సీడెడ్ ఏరియాలో దక్కుతున్నాయి. దానితో రాబోయే రోజుల్లో ఈ సినిమా బాహుబలి 2 సినిమా కలెక్షన్లను దాటి రెండవ స్థానంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి దేవర పార్ట్ 1 సినిమా సీడెడ్ ఏరియాలో రెండవ స్థానంలోకి వస్తుందా లేకపోతే మూడవ స్థానంలోనే ఆగిపోతుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.