కత్తి టైటిల్ తో గుణశేఖర్ కు షాకిచ్చిన కళ్యాణ్ రామ్.. రవితేజ సైతం హర్ట్ అయ్యారా?
టైటిళ్లకు తోకలు తగిలించి వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని గుణశేఖర్ అన్నారు. రవితేజ కోసం టైటిల్ రిజిష్టర్ చేయించుకున్నానని రవితేజ లాంటి మాస్ హీరోకు ఆ టైటిల్ నప్పుతుందని గుణశేఖర్ అన్నారు. కళ్యాణ్ రామ్ తన పేరును సైతం టైటిల్ తో కత్తి స్థాయిలో రాసుకుంటే మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గుణశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
టైటిల్స్ కు తోకలు పెట్టి వాడుకోవడం సినిమా ఇండస్ట్రీకి విష వృక్షంలా మారిందని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి కత్తి మూవీ దర్శకనిర్మాతలను సంప్రదించినా వాళ్ల నుంచి సరైన స్పందన మాత్రం రాలేదని గుణశేఖర్ తెలిపారు. ఈ టైటిల్ వివాదం విషయంలో అప్పట్లో రవితేజ కూడా హర్ట్ అయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించడం గమనార్హం.
తాను బాధ, ఆవేదనతో మాట్లాడుతున్నానే తప్ప రచ్చ చేయాలని అనుకోవడం లేదని గుణశేఖర్ పేర్కొన్నారు. అప్పట్లో ఈ వివాదం గురించి కళ్యాణ్ రామ్ సైతం స్పందించలేదు. కళ్యాణ్ రామ్ కత్తి టైటిల్ వివాదం విషయంలో దాసరి మధ్య వర్తిత్వం చేశారని వార్తలు వినిపించాయి. మల్లిఖార్జున్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సనాఖాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.