SSMB 29: మహేష్ - రాజమౌళి రిలీజ్ ఎప్పుడంటే... !

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో టాలీవుడ్ నుంచే చాలా సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా అలాగే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ తెర‌కెక్కుతున్న పుష్ప 2 సినిమా. ఈ రెండు సినిమాల కంటే కూడా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్టు పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరిలోనూ కనీ విని ఎరగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది ... ఎలా షూటింగ్ జరుపుకుంటుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్లు చాలా వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే జనవరిలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. రాజమౌళి మామూలుగానే ఒక్కో సినిమాకు రెండు సంవత్సరాలకు పైగా టైమ్ తీసుకుంటారు .. మరి ఇప్పుడు మహేష్ బాబుతో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది ... ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల ఏకంగా 2028 లో ఉంటుంది అంటూ ఇప్పటికే చాలా ఊహాగానాలు వచ్చాయి.

అయితే లేటెస్ట్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ ఒక ఏడాది ముందే అంటే 2027 లోనే విడుదలకు రావచ్చు అని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ యేడాది సంక్రాంతి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. 2024 కాలగర్భంలో కలిసిపోయింది .. 2027లో మహేష్ రాజమౌళి సినిమా రిలీజ్ అంటే దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సినీ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడక తప్పదు. అయితే భారతదేశం తో పాటు ప్రపంచాన్ని షేక్ చేసే ఈ సినిమా ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యే వరకు ఒకటే ఆసక్తి .. ఒకటే ఉత్కంఠ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: