మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందు కోగలిగింది. ఇకపోతే గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ , రాజమౌళి తో సినిమా చేయబోతున్నాడు . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది . ఈ మూవీ స్టార్ట్ కాక ముందే ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మహేష్ డిఫరెంట్ లుక్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు . అందులో భాగంగా పొడబాటి జుట్టుని గుబురు గడ్డాన్ని కూడా పెంచాడు.

బాడీని కూడా భారీ ఎత్తున డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా రాజమౌళి సినిమా కోసం మహేష్ ఇది వరకు ఏ సినిమాలో కనిపించని ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే పైన మహేష్ తో ఓ చిన్న బాబు ఉన్నాడు. అతని ఎవరో గుర్తుపట్టారా ..? అతను టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడికి కుమారుడు. ఇప్పటికే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
 

ఇక ఆ నటుడు ఎవరో తెలుసా ఆయనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ తనయుడు రోషన్. చిన్న తనంలో రోషన్ , మహేష్ బాబుతో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే రోషన్ ఆఖరుగా పెళ్లి సందD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: